బన్నీ వైఫ్ గ్లామర్ ఫోటో షూట్స్ వెనుక ఇంత కథ ఉందా... తీరని ఆ కోరిక తీర్చుకోవడానికేనట!

Published : Nov 23, 2022, 10:56 AM IST

అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. స్నేహారెడ్డి ఇలాంటి పోస్ట్స్ చేయడం వెనుక కారణం ఏమిటీ? ఆమె ఎలాంటి ఇమేజ్ కోరుకుంటున్నారనే సందేహాలు వెలువడుతున్నాయి.   

PREV
18
బన్నీ వైఫ్ గ్లామర్ ఫోటో షూట్స్ వెనుక ఇంత కథ ఉందా... తీరని ఆ కోరిక తీర్చుకోవడానికేనట!
Allu Sneha Reddy

హౌస్ వైఫ్ స్నేహారెడ్డి తనకంటూ సపరేట్ ఇమేజ్ కోరుకుంటున్నారు. ఆమె దీనికోసమో తాపత్రయ పడుతున్నారు. బన్నీ భార్యగానే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలి అనుకుంటున్నారు. ఈ జెనరేషన్ లో ఇది కామనే. హై క్లాస్ సొసైటీకి చెందిన ఆడవాళ్లు కొంచెం ట్రెండీగానే ఉంటారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. 
 

28

అల్లు స్నేహారెడ్డి తరచుగా డిజైనర్ వేర్స్ ధరించి స్టార్ హీరోయిన్స్ ని తలపిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఏకంగా 8 మిలియన్స్ కి పైగా నెటిజెన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. ఇది ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు.

38

సమంత పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న ప్రియాంక జవాల్కర్ రూపొందించిన బట్టల్లో స్నేహారెడ్డి చాలా అందంగా కనిపిస్తున్నారు. స్లిమ్ అండ్ ఫిట్ బాడీలో మనసులు దోచేస్తున్నారు. స్నేహారెడ్డి ఇలా గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు కొందరు. 

48
Sneha Reddy

పెళ్లి కాక ముందు స్నేహారెడ్డి హీరోయిన్ కావాలి అనుకున్నారట. ఆ దిశగా ఆమె ప్రయత్నాలు చేయాలి అనుకున్నారట. స్నేహారెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థలు నడుపుతున్నారు. దీంతో ఆయన స్నేహారెడ్డి కోరికను కాదన్నారట. హీరోయిన్ కావడానికి ఒప్పుకోలేదట. 
 

58

పేరెంట్స్ అనుమతి లేకపోవడంతో చేసేది లేక స్నేహారెడ్డి తన కల చంపుకున్నారట. అలాంటి స్నేహారెడ్డికి హీరో అల్లు అర్జున్ భర్తగా వచ్చాడు. దాంతో తాను కోరుకున్న సినిమా ప్రపంచంలో ఆమె అడుగుపెట్టారు. సినిమా కుటుంబంలోకి కోడలిగా వెళ్లారు. 

68


అప్పుడు అణచుకున్న తన కోరికను స్నేహారెడ్డి ఇప్పుడిలా తీర్చుకుంటున్నారట. తన అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే భర్త దొరకడంతో డిజైనర్ వేర్స్ ధరించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆ విధంగా హీరోయిన్ కావాలనుకున్న తన కోరిక, వెండితెరపై అందంగా కనిపించి అలరించాలన్న ఆశ తీర్చుకుంటున్నారట. 

78

కాగా ఇటీవల స్నేహారెడ్డి ఓ స్టార్ హీరో మూవీలో నటిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సదరు మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 
 

88


ఇక 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ వేడుకలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. పదేళ్లకు పైగా అన్యోన్యదంపతులుగా ఉంటున్న ఈ జంటకు అయాన్, అర్హ పిల్లలుగా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories