ఈరోజు ఎపిసోడ్లో పరంధామయ్య ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ పరంధామయ్యను నవ్వించడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు తులసి మావయ్యను మళ్ళీ మామూలు మనిషి చేయడం కోసం పాపం ఆ అంకుల్ చాలా ప్రయత్నిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఎప్పటికి మనలోకి వస్తాడు అని దిగులుగా ఉంది అనడంతో తగిలింది చిన్న దెబ్బ కాదు తులసి గారు అని అంటాడు సామ్రాట్. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం అని అంటాడు సామ్రాట్. మరొకవైపు సామ్రాట్ వల్ల బాబాయ్ ప్రశ్నలు వేస్తూ పరంధామయ్య నవ్వించాలి అని చూడగా తులసి వాళ్ళు నవ్వుతారు తప్ప పరంధామయ్య మాత్రం అలాగే ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ప్రవర్తన చూసి తులసి వాళ్ళు నవ్వుతూ అక్కడికి వెళ్తారు.