ఈరోజు ఎపిసోడ్ లో దేవి(devi), చిన్మయి ఇద్దరు స్కూల్ కి వెళ్తూ ఉంటారు. దేవి తన ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పార్టీ ఇవ్వాలి అనే 500 రూపాయలు తెచ్చుకుంటుంది. ఇక స్కూల్ కి వస్తున్నప్పుడు ఆ డబ్బులు గాలికి ఎగిరిపోయి ఒక తాగుబోతు చేతిలో పడటంతో ఆ డబ్బులు ఇవ్వడానికి అతడు ఒప్పుకోడు. నా డబ్బు అంటూ దేవి(devi)తో వాదిస్తాడు.