నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. నయన్, విగ్నేష్ వివాహానికి సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ జంట థాయిలాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
26
గతంలో విగ్నేష్ శివన్, నయనతార ఎన్నో వెకేషన్స్ కి వెళ్లారు. కానీ పెళ్లి తర్వాత హనీమూన్ చాలా ప్రత్యేకం. లైఫ్ లో మెమొరబుల్ గా మారిపోతుంది. అందుకే నయన్, విగ్నేష్ అన్నింటిని పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు.
36
విగ్నేష్ శివన్ థాయిలాండ్ లో నయన్ తో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు. నయనతార, విగ్నేష్ శివన్ ఫుడ్ కోసం ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. బాగా ఆకలితో ఉన్న నయన్ ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న పిక్ ని విగ్నేష్ షేర్ చేశాడు.
46
ఈ పిక్ లో నయన్ అమాయకపు చూపులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. బ్లాక్ టాప్ ధరించిన నయన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ పిక్ లో నయనతార మెడలో తాళి బొట్టు కనిపిస్తోంది. దీనితో నెటిజన్లు ఈ ఇక ని వైరల్ చేస్తున్నారు.
56
ఈ ఫోటోలో మరో ప్రత్యేకం ఏంటంటే.. నయనతార చేతికి ఉన్న 6వ వేలు కూడా కనిపిస్తోంది. దీనిని గుర్తించిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా నయనతార 37 ఏళ్ల వయసులో నిత్యం తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ కి ఎండ్ కార్డు వేసింది. విగ్నేష్ ని వివాహం చేసుకుని అన్ని రూమర్స్ కి చెక్ పెట్టేసింది.
66
Nayanthara Vignesh Shivan
ఇక నయనతార మునుపటిలా సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుందా లేదా అనేదే ప్రశ్న. ఇప్పటికే నయనతార గ్లామర్ రోల్స్ కి దూరం కాబోతున్నట్లు నిర్మాతలకు చెప్పేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేయబోతున్నట్లు టాక్.