Janaki Kalaganaledu: షాకింగ్ ట్విస్ట్... మంటల్లో కాలిపోతున్న జ్ఞానంబ.. జానకికి దూరంగా రామచంద్ర!

Published : Apr 14, 2022, 03:07 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పరువుగల కుటుంబమనే నేపథ్యంలో మంచి ప్రేమ అనురాగలతో కూడిన నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Janaki Kalaganaledu: షాకింగ్ ట్విస్ట్... మంటల్లో కాలిపోతున్న జ్ఞానంబ.. జానకికి దూరంగా రామచంద్ర!

జానకి (Janaki).. తన అన్నయ్య చేసిన తప్పు వల్ల బాగా ఎమోషనల్ అవుతుంది. అంతేకాకుండా తన అన్న యోగిని కలిసి ఎందుకిలా చేశావు అని ప్రశ్నిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక యోగి జ్ఞానంబ (Jnanamba) నిన్ను బాధ పెడుతుంది అన్న ఉద్దేశంతో ఇలా చేశాను అని.. నువ్వు నా చెల్లెలివే కాదు కూతురు లాంటిది దానివని అంటాడు.
 

27

దాంతో జానకి అంతా ప్రేమ ఉన్నవాడివి గతంలో చదువు విషయంలో ఎందుకు అబద్ధం చెప్పి పెళ్లి చేశావంటూ దానివల్లే ఇప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది. దాంతో యోగి (Yogi) తన చెల్లెలి ఎమోషనల్ తట్టుకోలేక జ్ఞానంబ (Jnanamba) కాళ్ళ మీద పడి క్షమాపణలు చెబుతాను అని అంటాడు.
 

37

ఇద్దరు కలిసి జ్ఞానంబ (Jnanamba) దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడుగుతారు. కానీ జ్ఞానంబ వాళ్లు రావడంతో కోపం తో రగిలిపోతుంది. పైగా యోగి కాళ్ళ మీద పడి ఇదంతా నా పొరపాటు వల్ల జరిగింది అని.. ఇందులో జానకి ప్రమేయం లేదు అని అనడంతో జ్ఞానంబ ఇదంతా జానకి ప్లాన్ అనుకొని జానకిని (Janaki) గోరంగా అవమానించింది.
 

47

దాంతో జానకి (Janaki) తన తప్పు లేదు అంటూ ఎంత బతిమాలినా కూడా జ్ఞానంబ (Jnanamba)అసలు కరగదు. మీ అన్ననైనా నేను క్షమిస్తాను కానీ నిన్ను మాత్రం ఈ జీవితంలో క్షమించను అని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. దాంతో జానకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 

57

జ్ఞానంబ (Jnanamba) ఇంట్లో వంట చేయడానికి సిద్ధమవుతూ తన కొడుకు రామచంద్ర (Rama Chandra) గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో తను గ్యాస్ ఆన్ చేసి ఉంటుంది. అలా కొద్దిసేపు తర్వాత వెలిగించడం తో ఒకేసారి మంటల్లో కాలిపోయినట్లు కనిపిస్తుంది.
 

67

కానీ ఇదంతా నిద్రపోతున్న రామచంద్రకు (Rama Chandra) పీడ కలలా వస్తుంది. వెంటనే రామచంద్ర తన తల్లి దగ్గరికి వెళ్లి బాగున్నావ్ కదా అమ్మా అంటూ ఎమోషన్ అవుతాడు. ఇక అక్కడనుంచి వెళ్ళి పోతూ మల్లిక (Mallika)తో అమ్మను వంటగదిలోకి అసలు పంపించకు అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

77

గోవిందరాజులు (Govindharajulu).. రామచంద్రకు ఏదో పిడకల వచ్చినట్లుంది. అందుకే అలా ప్రవర్తించాడు అని అనడంతో మల్లిక మరోసారి జానకి మీద పుల్లలు వేస్తుంది. మరోవైపు రామచంద్ర, జానకి (Janaki)లు తమ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు.

click me!

Recommended Stories