Intinti Gruhalakshmi: నందు నన్న విడిచిపెట్టడన్న లాస్య.. అమ్మ అని పిలవద్దంటూ ప్రేమ్ కు షాకిచ్చిన తులసి!

Published : Apr 14, 2022, 01:52 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఒక కుటుంబ బాధ్యతలు మోసే గృహిణి నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
 Intinti Gruhalakshmi: నందు నన్న విడిచిపెట్టడన్న లాస్య.. అమ్మ అని పిలవద్దంటూ ప్రేమ్ కు షాకిచ్చిన తులసి!

తులసి (Tulasi) పాత ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఇంట్లోకి మొదట ఎవరు అడుగు పెట్టాలి అని అక్కడ కాసేపు చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక అనసూయను (Anasuya) మొదట ఇంట్లోకి అడుగు పెట్టమని తులసి అంటుంది.
 

27

కానీ అనసూయ వయసుతో వచ్చే పెద్దరికం చెప్పుకోవడానికి కానీ.. అసలైన పెద్దరికం నీదే అంటూ తులసితో మొదట ఇంట్లో అడుగు పెట్టింది. ఇక ఇంట్లోకి అడుగు పెట్టాక దివ్య (Divya) కాస్త నిరాశగా ఉన్నట్లు అనిపిస్తుంది.  అక్కడ ఐదు బెడ్ రూమ్ లు ఉండేవి అనడంతో..  ఆ మాటకు తులసి (Tulasi) గదులు ఎన్ని తక్కువగా ఉంటే మనుషులు అంత దగ్గరగా కలిసి ఉంటామని అంటుంది.
 

37

ఇక దివ్య తన గది ఎక్కడ ఉందో చెప్పు అని అనడంతో ఉన్న రూముల్లో అందరికీ అడ్జస్ట్ చేస్తుంది తులసి. అలా వారందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అంతలోనే నందు (Nandhu) లాస్య (Lasya)ని తీసుకొని వస్తాడు. ఇక పరందామయ్య వాళ్లను చూసి వెటకారంగా మాట్లాడుతాడు.
 

47

దాంతో నందు (Nandhu) మరింత కోపంతో రగిలిపోతూ.. మీ మాజీ కోడలు గొప్పదనం గురించి మాట్లాడదాం.. ప్రాణం పోయినా ఇల్లు కాపాడుతా అంటూ బిల్డప్ ఇచ్చింది కదా.. ఇప్పుడు చూడు ఏం చేసిందో అంటూ గట్టిగా అరుస్తాడు. పక్కన ఉన్న లాస్య (Lasya) కూడా తులసి నానా మాటలు అంటుంది.
 

57

నీ చుట్టూ నీ సైనికులు చాలా మంది ఉన్నారు.. కానీ నా చుట్టూ నందు (Nandhu) ఒక్కడే ఉన్నాడు.. కలలో కూడా వదిలిపెట్టను అని మాట ఇచ్చాడని అనడంతో వెంటనే తులసి (Tulasi).. నాకు కూడా వేదమంత్రాల సాక్షిగా మెడలో తాళి కట్టాడు. కానీ ఇప్పుడు ఏం చేశారో చూసావు కదా అంటూ అదిరిపోయే సమాధానమిస్తుంది తులసి.
 

67

ఇక నందు (Nandhu) తన తల్లిదండ్రులను తనతో రమ్మని అడగటంతో వాళ్లు నందుతో వెళ్లడానికి ఇష్ట పడరు. దాంతో నందు కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుండగా.. ప్రేమ్ ఎదురు పడతాడు. వెంటనే నందు తులసిని మరిన్ని మాటలతో గట్టిగా అరుస్తాడు. ఇక తులసి ప్రేమ్ (Prem) ను చూసి అక్క నుంచి వెళ్ళిపొండి అంటూ గట్టిగా అంటుంది.
 

77

శృతి (Shruthi) ఎంత చెప్పినా కూడా తులసి కఠినంగా మాట్లాడుతుంది. వాడి బాధ్యతలు వాడు నేర్చుకోవాలి అంటూ.. నన్ను అమ్మ అని పిలవద్దు అంటూ నానారకాల మాటలతో ప్రేమ్ (Prem) ను బాధ పెడుతుంది. దాంతో ప్రేమ్   కూడా తను ఎదిగే వరకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టను అని మాట ఇస్తాడు.

click me!

Recommended Stories