Janaki Kalaganaledu: రామచంద్రకు దైర్యం చెప్పిన జానకి.. కొత్త బిజినెస్ మొదలు పెట్టిన రామచంద్ర?

First Published Jan 28, 2023, 11:12 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 28వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో మల్లికకు బిక్షగాడు జాతకం చెబుతూ ఉండగా అతని మాటలు విన్న మల్లిక ఊహల్లో తేలిపోతూ ఉండగా అదే అదునుగా భావించిన ఆ పిచ్చోడు మల్లిక రింగు కొట్టేయాలని చూడడంతో వాడిని చితకబాదుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి లీలావతి వచ్చి అబ్బబ్బ మల్లిక వాన్ని వదిలిపెట్టు నీకు ఒక విషయం చెప్పాలి అనడంతో మల్లిక ఆ పిచ్చోన్ని వదిలి పెట్టేస్తుంది. ఏంటి పెద్దమ్మ అని అనగా మీ బావగారిని జాబ్ లో నుంచి తీసేసారు అనడంతో మల్లిక ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జానకి వచ్చి వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు మల్లిక బాగా అయింది పొద్దున ఏదో జాబ్ వచ్చింది అని విర్రవీగుతూ వెళ్ళాడు అయినా జాబ్ లో నుంచి ఎలా తీసేసారు పెద్దమ్మ అనడంతో అప్పుడు లీలావతి జరిగిందే మొత్తం వివరిస్తుంది.
 

షాప్ లో రామచంద్రా నీది తో మిఠాయిలు చేసి అక్కడ పెట్టడంతో అప్పుడు ఆ షాపు ఓనర్ ఇలా నేతితో మిఠాయిలు చేసి పెడితే కస్టమర్స్ రావడం ఏమో కానీ నేను కూడా నీలాగే షాపు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అని అంటాడు. అదేంటండి క్వాలిటీ లేకుండా స్వీట్స్ తయారు చేస్తే ఎలా అనడంతో నేను చెప్పినట్టు చేయాలి రామా అనడంతో దాల్దాతో నేను స్వీటు తయారు చేయలేనండి అని అంటాడు రామచంద్ర. అయినా అలా జనాలను మోసం చేయడం తప్పు కదా అని అంటూ నేను మోసం చేస్తున్నానా అని అంటాడు షాప్ ఓనర్. మీరు చెప్పినట్టుగా అంటే నేను చేయలేదండి అనడంతో సరే ఇకనుంచి వెళ్ళిపో ఈరోజు నుంచి పనిలోకి రావద్దు అని అంటాడు.
 

అది జరిగింది మల్లిక అంటూ లీలావతి జరిగిన మొత్తం మల్లికకు వివరిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న జానకి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లీలావతి మల్లిక ఆ విషయాన్ని చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు జానకి ఏంటిది ఇలా జరుగుతోంది. పని దొరికింది అనుకునే లోపే పని పోయింది అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సి అఖిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అఖిల్ రావడంతో ఎక్కడికి వెళ్లావు అఖిల్ అనడంతో ఏ పని పాట లేనోని కదా నా గురించి నీకెందుకు అని అనగా నేను ఆ మాట అనలేదు కదా అఖిల్ మల్లిక అక్క మాటలు పట్టించుకోవద్దు అంటుంది జెస్సి. వదినే కాదు మా నాన్న కూడా అలాగే అందరూ పనికిరాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు కదా అంటాడు అఖిల్.
 

అప్పుడు జ్ఞానాంబ అమ్మ జెస్సి ఎవర్ని ఎందుకు ముందు వాడికి అన్నం పెట్టు అనడంతో నాకేం వద్దులేమ్మా అని అంటాడు అఖిల్. అప్పుడు జ్ఞానాంబ అక్కడికి వెళ్లి నిన్ను ఎవరు పరాయి వాళ్ళు అనలేదు కదా మీ నాన్నే కదా అని అంటుంది. తండ్రిగా ఒక మాట అనడం తప్ప అనడంతో తప్పు కాదమ్మా అలా అందరూ ముందు అనగా నిన్ను తిట్టలేదు అఖిల్ మీ నాన్న మీ బాధ్యతను గుర్తు చేశాడు అంటుంది జ్ఞానాంబ. నాకు ఉద్యోగం వచ్చే వరకు నేను భోజనం చేయనమ్మా అనడంతో ఆ పౌరుషం బయట చూపించు భోజనం మీద కాదు అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జ్ఞానాంబ అఖిల్ కి దగ్గరుండి భోజనం వడ్డిస్తుంది.

అప్పుడు జానకి రామచంద్ర కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్ర అక్కడికి వస్తాడు. అప్పుడు రామచంద్ర బుక్స్ తీసుకొని వస్తాను అన్నాను. జానకి గారికి నా పని పోయింది అని తెలిస్తే బాధపడుతుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏంటండీ ఇంత లేట్ అయింది అనడంతో షాప్ దగ్గర లేట్ అయింది అని అబద్ధం చెబుతాడు రామచంద్ర. ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు కి టాబ్లెట్స్ ఇస్తూ ఉండగా అప్పుడు జానకి నాకు మీరు అబద్ధం చెప్పాల్సిన పనిలేదు మీరు షాపు మానేశారు అన్న సంగతి నాకు తెలుసు అనడంతో గోవిందరాజు,జ్ఞానాంబ షాక్ అవుతారు. నేను షాపు మానేయలేదు జానకి గారు క్వాలిటీ లేకుండా తయారు చేస్తుంటే అందుకే నేను రానని చెప్పాను అంటాడు రామచంద్ర.
 

సమాజం మారిపోయింది సమాజానికి అనుగుణంగా నడుచుకోవాలి అంటాడు గోవిందరాజులు. తర్వాత రామచంద్ర జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు జానకి గారు అని అనగా ఒకరి కింద బతికినన్ని రోజులు ఇలాగే ఉంటామో సొంతంగా మీరే ఏదైనా చేయండి అనడంతో ఇప్పటికిప్పుడు అనగా ఒకప్పుడు మీరు చిన్న బండి మీద అమ్మే వారు గుర్తుందా రామా గారు ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచే జీవితాన్ని మొదలు పెట్టండి. అది మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తుంది అని జానకి ధైర్యం చెబుతుంది. అప్పుడు రామచంద్ర జానకి గారు రేపు మనం బండి తీస్తున్నాము అని అంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం జానకి రామచంద్ర ఇద్దరూ బండి క్లీన్ చేస్తూ ఉండగా ఇంట్లో అందరూ అలాగే అర్థం కాక చూస్తూ ఉంటారు.
 

అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరు ఆ బండిని శుభ్రంగా క్లీన్ చేసి పెయింట్ వేస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు ఏంటి రామా బండి క్లీన్ చేశావు అనగా ఎలాగో సంపాదన లేదు కదా అద్దెకి ఇస్తున్నారు ఏమో అని అంటుంది మల్లిక. అప్పుడు రామచంద్ర ఎవరికి ఇవ్వడానికి కాదు నేనే మళ్ళీ బండిపై మిఠాయి కొట్టు పెడుతున్నాను అని అంటాడు. పెట్టుబడి అనడంతో దాని గురించి మీరేం ఆలోచించకండి అమ్మ నేను చూసుకుంటాను అని అంటాడు రామచంద్ర. దాని గురించి దిగులు పడకండి నా బండి అమ్మేశాను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత రామచంద్ర జానకి స్వీట్స్ అని సిద్ధం చేసి అత్తయ్య టెంకాయ కొట్టిన ఆశీర్వదించండి అత్తయ్య అని అనడంతో అప్పుడు జ్ఞానాంబ  తల్లి కాదు భార్య కూడా భర్త ఎదగాలని కోరుకుంటుంది నువ్వు టెంకాయ కొట్టి వ్యాపారం మొదలు పెట్టండి అని అంటుంది జ్ఞానాంబ.

click me!