Devatha: రాధకి సహాయం చేసిన జానకమ్మ.. మాధవ్ నిజస్వరూపం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న జానకమ్మ!

Published : Sep 23, 2022, 12:25 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...  

PREV
17
Devatha: రాధకి సహాయం చేసిన జానకమ్మ.. మాధవ్  నిజస్వరూపం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న జానకమ్మ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకమ్మ, రుక్మిణి దగ్గరికి వెళ్లి ఆఫీసర్ సరే నీ భర్త అని నాకు తెలుసు అమ్మ. నువ్వు పరాయి దానిల ఇక్కడ ఉండాల్సి వస్తుందని నువ్వు ఎంత కుమ్ములిపోతున్నావో నాకు అర్థమైంది. నాకు మాధవ్ బుద్ధి కూడా ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది ఇంక నీకు ఇంట్లో ఉంటే ప్రమాదం, ఇప్పుడే దేవిని తీసుకొని వెళ్ళిపో. చిన్మయికి నేను ఎలాగైనా సద్ది చెప్పుకుంటాను కానీ దేవి మాధవ్ తన కన్న తండ్రి అనీ, మేమే వాళ్ళ సొంత నానమ్మ తాతయ్యలను అని అనుకుంటుంది.
 

27

దానికి ఎలా నచ్చ చెప్పుకుంటావు అని అడగగా, మాధవ్ సార్,దానికి తను తన తండ్రి కాదు అని చెప్పారమ్మ, ఆ విషయం భయపడాల్సిన అవసరం లేదు మేము వెళ్ళిపోతాము కానీ నాకు మీ నగలు వద్దు నేను. సొంతంగా బతుకుతాను అని అంటుంది.అప్పుడు జానకమ్మ నగలు లేకుండా, డబ్బులు లేకుండా ఎలాగమ్మా అని అనగా,నా దారి మేము చూసుకుంటాం అమ్మ. చిన్మయి మీరు అందరూ జాగ్రత్త మేము వెళ్ళిపోతాము అని అంటుంది.అప్పుడు జానకమ్మ మీకు అడ్డు రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేస్తాను అని అంటుంది.
 

37

అప్పుడు రాద జానకమ్మని హద్దుకొని, మీ కొడుకు అని కూడా చూడకుండా నాకు సహాయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అమ్మ అని అంటుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ పాలలో మందు మాత్ర కలిపి మాధవ్ కి ఇస్తుంది. ఎప్పుడు లేనిది నువ్వెందుకు పాలు తెచ్చావమ్మా అని మాధవ్ అనగా, నేను తేకుడదా, ముందు పాలు తాగు అని అంటుంది. అప్పుడు మాధవ్, నువ్వు వెల్లమ్మ ఇక్కడ పెట్టేసి, నేను తాగుతానులే అని అంటాడు. చల్లారిపోతుంది తాగు అని జానకమ్మ మరీ మరీ అంటుంది.మాధవ్ కి అనుమానం వస్తుంది.
 

47

జానకమ్మ వెళ్లిపోయిన తర్వాత మాధవ్ తన గదిలోకి వెళ్లి,పాలల్లో నిద్ర మాత్రం కలిపితే నేను మోసపోయి తాగుతాను అనుకుంటున్నావా అమ్మ, నీ సంగతి నాకు తెలుసు.రాధ నీ  శ్రీశైలం తీసుకువెళ్లడం తథ్యం, ఎవరు దాన్ని ఆపలేరు అని వెళ్లి తయారవుతానికి బయలుదేరుతాడు. ఇంతలో జానకమ్మ, పైకి వస్తూ మాధవ్ పాలు తాగాడో లేదో, పడుకున్నాడో లేదో చూద్దాము అని రాగా అప్పటికే పాలు అక్కడ నిండుగా ఉంటాయి. మాధవ్ స్నానం చేస్తూ ఉంటాడు.
 

57

అప్పుడు జానకమ్మకి లగ్నపత్రిక తాళి కనిపిస్తుంది లగ్నపత్రికలో ఒక ముహూర్తం రాసి,రాధ మాధవుల పెళ్లి అని ఉంటుంది. దానికి జానకమ్మ ఆశ్చర్య పోతుంది. అదే సమయంలో రుక్మిణి బట్టలన్నీ సర్దుకుని దేవిని కూడా సద్దమంటుంది.ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము  అమ్మ ఇంత తెల్లవారుజామున అని దేవి అనగా, ఏం మాట్లాడద్దు బిడ్డ నెమ్మదిగా అని అంటుంది.మరో వైపు జానకమ్మ అవన్నీ చూసి ఆశ్చర్యపోయి అలా మంచం కూర్చున్న సమయంలో మాధవ్ బాత్రూం నుంచి బయటికి వస్తాడు.
 

67

జానకమ్మ అటు వైపు తిరిగి ఉండడం చూసి మళ్లీ బాత్రూంలోకి వెళ్లి తన కర్ర తెస్తాడు. ఇక్కడికి వచ్చావేంటమ్మా ఏమైంది అని అనగా జానకమ్మ అవన్నీ చూపించి, మాకు రాదని కోడలుగా చేసుకోవాలి అనిపించింది కానీ ఎప్పుడైతే రాధకు ఇష్టం లేదన్నదో అప్పుడు మేము ఊరుకున్నాము. అలాగే నువ్వు కూడా మారుతావు అని అనుకున్నాము కానీ నువ్వు ఇంతవరకు దీన్ని తీసుకొస్తామని అనుకోలేదు. ఇప్పుడే నేను ఈ విషయం మీ నాన్నకు చెప్తాను.
 

77

 నువ్వు శ్రీశైలం వెళ్లడానికి వీలు లేదు అని బయటకు వెళ్తూ ఉండగా మాధవ్ జానకమ్మని ఆపి ఇది నా చాలా సంవత్సరాల కల, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు వచ్చి అడ్డుకోవద్దు నీ పని నువ్వు చూసుకో అమ్మా అని అనగా, జానకమ్మ గది నుంచి బయటికి వెళ్లి ఏవండీ ఏవండీ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు మాధవ్ నాన్నకు తెలిస్తే ప్రమాదం అని భయపడి జానకమ్మ నీ ఆపడానికి ప్రయత్నించిన జానకమ్మ, ఆపదు.అప్పుడు మాధవ్ మెట్ల నుంచి జానకమ్మ నీ కింద పడేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories