ఆస్కార్స్ కి ఆర్ఆర్ఆర్ నో ఎంట్రీ.. నిఖిల్ అంత మాట అనేశాడు ఏంటి ?

First Published Sep 23, 2022, 12:22 PM IST

ఇండియా తరఫున ఆస్కార్స్ నామినేషన్స్ కి ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంటుందని దేశం మొత్తం అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయలేదు.

ఇండియా తరఫున ఆస్కార్స్ నామినేషన్స్ కి ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంటుందని దేశం మొత్తం అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. ఓ గుజరాతీ చిత్రాన్ని ఎంపిక చేసి ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. దీనితో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి వెళుతుందని హాలీవుడ్ క్రిటిక్స్ సైతం అంచనా వేసిన సంగతి తెలిసిందే. 

ఇండియా నుంచి ఆ అవకాశం మిస్ కావడంతో రాజమౌళి హాలీవుడ్ నుంచి, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయకపోవడంతో చాలా మంది ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నారు. 

RRR Movie

దీనిపై యంగ్ హీరో నిఖిల్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు నిఖిల్ రీసెంట్ గా కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ మనకి ఎందుకు ? ఆ అవార్డు మనకి అవసరామా ? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆస్కార్ అవార్డు మనకి అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దేశ విదేశాల ప్రేక్షకులు అభినందించారు. అదే గొప్ప విజయం. ఇక ఆస్కార్ అవార్డు ఎందుకు. అయినా మన సినిమాలకి ఆస్కార్ వాళ్ళ సర్టిఫికెట్ ఎందుకో నాకు అర్థం కాదు. మనకి జాతీయ అవార్డ్స్, ఫిలిం ఫేర్ ఉన్నాయి. 

అన్ని అవార్డుల లాగే ఆస్కార్ కూడా విదేశాల్లో ఇచ్చే అవార్డు. దానికోసం మనం ఎందుకు పాకులాడాలి అని నిఖిల్ అన్నారు. ఇక్కడ నేనేదో ఆస్కార్స్ కి ప్రాధాన్యత లేదు అని మాట్లాడడం లేదు. కానీ మనం దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నిఖిల్ తెలిపాడు. 

నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం ఆగష్టు లో విడుదలై తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. శ్రీకృష్ణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కృష్ణుడి గురించి ఎంతో అద్భుతమైన విషయాలని ఈ చిత్రంలో తెలిపారు. 

click me!