Janaki kalaganaledu: జానకి మీద అసంతృప్తితో జ్ఞానాంబ.. జెస్సికి ఇంటి పద్ధతులు గురించి చెప్పిన జానకి!

Published : Sep 23, 2022, 12:07 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
18
Janaki kalaganaledu: జానకి మీద అసంతృప్తితో జ్ఞానాంబ.. జెస్సికి ఇంటి పద్ధతులు గురించి చెప్పిన జానకి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జెస్సి అఖిల్ తో, ఈరోజు నుంచి మనం బయటకు మాత్రమే భార్యాభర్తలం, లోపల నీకు నాకు ఏం సంబంధం లేదు. నేను నీతో పెళ్లికి ఒప్పుకున్నది నా బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు అని మాత్రమే అని అంటుంది. అప్పుడు అఖిల్,నువ్వు ఏం సంబంధం లేదని, అమ్మ ఏం సంబంధం లేదని నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. నన్ను క్షమించు జెస్సీ, నువ్వు లేకపోతే నేనుండలేను. ఇంకెప్పటికీ ఇలా చేయను అని కాలు మీద పడతాడు. అప్పుడు మాయ మాటలు చెప్పి జెస్సిని వెళ్లి హద్దుకుంటాడు అప్పుడు. జెస్సి అఖిల్ నీ ఊరుకోపెడుతుంది.
 

28

హమ్మయ్య ఈ పూటకు ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసాము అని అనుకుంటాడు అఖిల్. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకొని అనవసరంగా జానకిరామాలను తప్పుగా అనుకున్నాను. చేయని తప్పుకి జానకి ఇచ్చిన ఒక అవకాశం చెరిపేసాను అని అనుకొని మొదటి అవకాశాన్ని కట్ చేసిన చోటున దాన్ని చెరపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు గోవిందరాజు ఒకడికి వచ్చి అది చెరగదు, నువ్వు జానకిని తప్పుగా అనుకున్నావు జానకి గురించి తెలిసినా అనుమానించావు.
 

38

 ఇప్పటికైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించు అని అనగా, నిజంగానే తప్పు జరిగిపోయింది అండి అయినా జానకి విషయంలో నాకు పూర్తి సంతృప్తి లేదు. తను చేసిన పని మంచిదే కానీ ఒక బాధ్యత తీర్చడం కోసం ఇంకొక బాధ్యతను వదిలేయడం సరైనది కాదు. అఖిల్ విషయం వల్ల తన జీవితానికి ఎంతో ముఖ్యమైన పరీక్షను వదిలేసింది అంటే తన మీద నేను పెట్టుకునే నమ్మకం నిలబెట్ట లేనట్టే కదా! ఈ విషయానికే ఇంతలా ఇబ్బంది పడితే పెద్దయ్యక పోలీస్ అవుతే ఎలాగ రాణించగలదు అని అనుకుంటుంది.అప్పుడు రామా ఈ మాటలు అన్నీ విని బాధపడుతూ కూర్చుంటాడు.
 

48

 ఇప్పటికైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించు అని అనగా, నిజంగానే తప్పు జరిగిపోయింది అండి అయినా జానకి విషయంలో నాకు పూర్తి సంతృప్తి లేదు. తను చేసిన పని మంచిదే కానీ ఒక బాధ్యత తీర్చడం కోసం ఇంకొక బాధ్యతను వదిలేయడం సరైనది కాదు. అఖిల్ విషయం వల్ల తన జీవితానికి ఎంతో ముఖ్యమైన పరీక్షను వదిలేసింది అంటే తన మీద నేను పెట్టుకునే నమ్మకం నిలబెట్ట లేనట్టే కదా! ఈ విషయానికే ఇంతలా ఇబ్బంది పడితే పెద్దయ్యక పోలీస్ అవుతే ఎలాగ రాణించగలదు అని అనుకుంటుంది.అప్పుడు రామా ఈ మాటలు అన్నీ విని బాధపడుతూ కూర్చుంటాడు.
 

58

 అప్పుడు జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు రామా మనసులో బాధని బయట పెట్టకుండా నవ్వుతూ మాట్లాడుతాడు. అప్పుడు జానకి, అత్తయ్య గారు అన్న మాటలు నేను కూడా విన్నా రామాగారు. మీరు లోపల బాధపడుతున్న బయట నవ్వుతూ ఉంటున్నారు. నేను చేసిన పని తప్పే ఇక నుంచి అలా చేయకుండా చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ హద్దుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం జ్ఞానాంబ తులసి కోట చుట్టూ పూజ చేస్తూ ఉంటుంది.జెస్సి ఫ్యాంటు షర్టు వేసుకొని వచ్చి ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉంటుంది. దాన్ని చూసిన మల్లికా ఆశ్చర్యపోయి, కారు నుంచి తప్పించుకుందామనుకున్న ఆటోడ్రైవర్ లారీ కి గుద్దినట్టు, జెస్సిని వాడుకొని నేను జానకిని ఇరికించాలి అని అనుకోని జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి, చూశారా అత్తయ్య గారు జానకి మీకు ఎంత తలనొప్పి తెచ్చిందో చూడండి అని చూపిస్తుంది.

68

అప్పుడు జ్ఞానాంబ జానకిని పిలిపించి, ఇంటి కోడలు అంటే ఇంట్లో సంప్రదాయాలకు విలువని ఇవ్వాలి ఉన్న పరువును తీయకూడదు. అలాంటి బట్టలు వేసుకొని ఇంట్లో ఉన్న గౌరవాన్ని మట్టి కలపకూడదని చెప్పు.కొత్తగా వచ్చిన వాళ్ళకే కాదు, కడుపున పుట్టిన కొడుకులు కూడా  ఎవరికీ నచ్చింది వాళ్ళ చేస్తున్నారు. కొడుకుంటే రామా లాగ్ ఉండాలి ఇంటికి పరువు ప్రతిష్టలు తేవాలి, గౌరవాన్ని ఇవ్వాలి,ఉన్న పరువును తీయకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అని చెప్పు జానకి ఇంకెప్పుడూ అలా జరిగినా నీదే బాధ్యత అని తిడుతుంది. అప్పుడు జానకి నేను మాట్లాడుతాను అత్తగారు, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి జెస్సిని గదిలోకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది జానకి. నేను ముందే చెప్పాను కదా జెస్సీ,ఇంట్లో ఇలా ఉండకూడదు అని.
 

78

కాలేజ్ లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు నాకు చెప్పావు కదా పద్ధతి గానే ఉంటాను అని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగా, నేను ఇంట్లో బట్టలు ఏవి సర్దుకోకుండా వచ్చేసాను అక్క. నాకు ఇక్కడ బట్టలు లేవు అందుకనే అఖిల్ బట్టలు వేసుకున్నాను అని అంటుంది. అప్పుడు జానకి ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు నా బట్టలు ఉన్నాయి కదా,నేను నీకు ఇస్తాను.అత్తయ్య గారి ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని చెప్తుంది.ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి సిద్ధమవుతారు.జానకి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అదే సమయంలో జెస్సి, అఖిల్ అక్కడికి వస్తారు. అప్పుడు జ్ఞానాంబ, నాకు ఆకలి లేదు అని వెళ్ళిపోతున్నప్పుడు గోవిందరాజు ఆపి, నీ పంతానికి ఆకలిని బలి చేయొద్దు జ్ఞానం అని చెప్తాడు. అప్పుడు జ్ఞానాంబ, భోజనం అంటే ఆకలి వేస్తేనే తినేది కాదు మనశ్శాంతిగా తినేది అని అంటుంది. 

88

ఇంతలో జెస్సి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. వచ్చి అందర్నీ పలకరిస్తారు. మీ ఇంటి కోడలిగా మా కూతుర్ని చేసుకున్నందుకు చాలా సంతోషం. జానకి, రామా మీరిద్దరూ లేకపోయి ఉంటే ఈ పని జరిగేది కాదు అని అంటారు.అప్పుడు రామా రండి వచ్చి భోజనం చేద్దాము అని అనగా, ఇప్పుడు వద్దు బాబు మా ఇంటిలో ఒక ఆచారం ఉన్నది. పెళ్లయిన కొత్త అప్పుడు నాన్ వెజ్ తో మేము విందు చేస్తాము అని అంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories