తమిళ సినీ పరిశ్రమలో సంచలనాలకు కారణం అయిన విజయ్ దళపతి సినిమా 'జన నాయగన్'. ఈమూవీ విడుదలపై నిర్మాత కేవీ నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ జననాయగన్ రిలీజ్ ఎప్పుడు?
కోలీవుడ్ లో సంచలనానికి కారణం అయిన సినిమా జన నాయగన్. ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని నెలలుగా జరుగుతున్న డ్రామా గురించి అందరికి తెలిసిందే. ఇక విజయ్ సీఎం అవ్వడంతో.. ఈసినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ విషయంపై నిర్మాత నారాయణ మాట్లాడుతూ, "సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఫైనల్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆలస్యమైంది. 2025 డిసెంబర్‌లోనే సినిమాను CBFCకి పంపాం. వాళ్లు సినిమా చూశాక U/A 16+ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చే టైమ్‌లో ఉన్నట్టుండి ప్రాసెస్‌ను ఆపేశారు" అని తెలిపారు.
24
ఆలస్యానికి కారణం ఏంటి?
జన నాయగన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక కంప్లైయింట్ వచ్చిందని ఈ-మెయిల్ ద్వారా తమకు సమాచారం అందిందని, దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారని నిర్మాత చెప్పారు. రిలీజ్‌కు ముందే ఇలాంటి ఫిర్యాదు రావడం తమను షాక్‌కు గురిచేసిందని ఆయన అన్నారు.
ఈ పరిణామాల మధ్య తాము కోర్టును ఆశ్రయించామని, సినిమా రిలీజ్‌కు ముందు బయటివాళ్ల ఫిర్యాదులు చెల్లవని వాదించామని తెలిపారు. విచారణలో, మొదట సినిమాకు ఓకే చెప్పిన ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడే తర్వాత అభ్యంతరం చెప్పినట్లు తెలిసిందని, దీనివల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ మరింత ఆలస్యమైందని వివరించారు.
34
విజయ్ అభిమానులు డిమాండ్ ఏంటంటే?
ఈక్రమంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వడంతో సినిమాపై అందరి దృష్టి పడింది. టైటిల్స్‌లో ' 'దళపతి విజయ్' అని కాకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్' అని వేయాలని అభిమానులు కోరుతున్నారని నారాయణ నవ్వుతూ చెప్పారు.
ప్రస్తుతం సెన్సార్ పనులు చివరి దశలో ఉన్నాయని, CBFCతో మాట్లాడుతున్నామని నిర్మాత తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మరో రెండు వారాల్లో సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నిజానికి ఈ సినిమా జనవరి 9నే రిలీజ్ కావాల్సింది, కానీ సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.
అదే సమయంలో, సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం మూవీ టీమ్ కు పెద్ద దెబ్బేసింది. ఈ విషయంలో ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళ సినీ పరిశ్రమ డిజిటల్ పైరసీ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, 'జన నాయగన్' సినిమాను త్వరగా అభిమానుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం అని నిర్మాత నారాయణ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.