కొత్త సినిమాలు వచ్చేలోపు..
కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేలోపు ఈ సినిమా తన కలెక్షన్లను మరింత పెంచుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మిగిలిన వీక్‌డేస్‌లో కూడా వసూళ్లు నిలకడగా కొనసాగితే, రెండో వారాన్ని కూడా మంచి వసూళ్లతో ముగించవచ్చు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో దళపతి విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి తారలు నటించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, విజయ్ స్టార్ పవర్, రిపీట్ ఆడియన్స్ సినిమా విజయానికి కారణమవుతున్నాయి.