OTT Movies: ఓటీటీలు ఇప్పుడు థియేటర్‌కి ఆల్టర్ నేట్‌గా మారాయి. ఆడియెన్స్ ఓ మోస్తారు నుంచి చిన్న సినిమాలను ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి.
ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా సినిమాలో ఓటీటీలోనే హిట్ అవుతున్నాయి. థియేటర్లో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం సినిమా వస్తుందని కూడా జనాలకు తెలియడం లేదు. అలాంటి చిత్రాలు ఓటీటీలోకి వచ్చి దుమ్మురేపుతున్నాయి. ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు స్టార్ ఫోక్ డాన్సర్ నాగదుర్గ మూవీ కూడా ఉంది. ఆమె తమిళంలో నటించిన తొలి చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోస్‌లో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు మొదటి స్థానంలో దూసుకుపోతుండటం విశేషం. మరి ప్రైమ్ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం.
25
ఇండియా వైడ్‌గా నెం 1 స్థానంలో నాగదుర్గ మూవీ
ప్రైమ్ వీడియోస్‌లో ఇండియాలో టాప్ 10 మూవీస్‌లో మొదటి స్థానంలో నాగదుర్గ నటించిన `లవ్ ఓ లవ్` అనే తమిళ సినిమా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రం ద్వారానే ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఇందులో పవీస్ నారాయణన్ హీరోగా నటించగా, సెల్వరాఘవన్, వనితా విజయ్ కుమార్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఇది రూపొందింది. జులై 10న ఈ చిత్రం విడుదలైంది, కాకపోతే థియేటర్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుందంటే దీన్ని ఎంత మంది చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నాగదుర్గ క్రేజ్ దీనికి కారణం కావడం విశేషం.
35
రెండో స్థానంలో వరలక్ష్మి పోలీస్ కంప్లైంట్
రెండో స్థానంలో హాలీవుడ్ మూవీ `ది డెవిల్స్ మౌత్` మూవీ ఇండియాలో ట్రెండ్ కావడం విశేషం. మూడో స్థానంలో తెలుగు సినిమా ఉంది. అదే `పోలీస్ కంప్లైంట్`. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రమిది. చాలా రోజుల క్రితమే థియేటర్లోకి వచ్చింది. కానీ ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. కాకపోతే సినిమా ఫర్వాలేదనే టాక్ వచ్చింది. అయితే చాలా గ్యాప్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఇండియా వైడ్‌గా మూడో స్థానంలో ట్రెండ్ కావడం విశేషం.
నాల్గో స్థానంలోనూ తెలుగు సినిమానే ఉంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన `నాగబంధం` మూవీ ప్రైమ్ వీడియోస్‌లో ట్రెండ్ కావడం విశేషం. ఇందులో విరాట్ కర్ణ హీరోగా నటించగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమిది. విజువల్ పరంగా మెప్పించిన ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుండటం విశేషం. వీటితోపాటు `మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` అనే హాలీవుడ్ చిత్రం ఐదో స్థానంలో ట్రెండ్ అవుతుంది.
55
సాయిపల్లవి మూవీ సైతం ట్రెండింగ్
ఆరో స్థానంలో సాయిపల్లవి నటించిన సినిమా ఉంది. ఆమె హిందీలో నటించిన `ఏక్ దిన్` సినిమా ఇండియా వైడ్‌గా ప్రైమ్ వీడియోస్‌లో ట్రెండ్ కావడం విశేషం. థియేటర్లో ఇది ఆడలేదు, కానీ ఓటీటీలో రచ్చ చేస్తోంది. ఏడో స్థానంలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ `అనోమీ` ఉంది. ఇందులో రెహ్మాన్, భవన ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ ఫర్వాలేదనిపించింది. కాకపోతే ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఎనిమిదో స్థానంలో కన్నడ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ `సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్` మూవీ ఉండగా, తొమ్మిదో స్థానంలో హాలీవుడ్ మూవీ `ఘోస్ట్ ట్రైన్`, పదో స్థానంలో `స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్` చిత్రాలున్నాయి. మొత్తంగా రెండు తెలుగు సినిమాలు, ఒకటి తెలుగు అమ్మాయి నటించిన చిత్రం ప్రైమ్ వీడియోస్‌లో టాప్ 10 లో ట్రెండ్ కావడం విశేషం.