ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు హవా నడిస్తే.. వారిదే రాజ్యం. వారు ఏం చెపితే అది జరిగిపోతుంది. అనఫిషియల్ గా వారు ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు కాస్త మీడియా హడావిడి వల్ల ఇది తగ్గినా..అప్పట్లో పెద్ద హీరోలతో పెట్టుకోవాలంటే భయపడేవారు. కెరీర్ ఏమౌతుందా అని భయపడేవారు. ఏం జరిగినా కామ్ గా ఉండేవారు.
కాని కొంత మంది మాతరం ఏదైనా జరగనీ అని ముందుకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివారికి కూడా చూక్కలు చూపించిన హీరోయిన్ గురించి తెలుసుకుందాం? ఆమె చేసిన పనికి వారు ఎలా రివేంజ్ తీర్చుకున్నారు. ఆమె ఆతరువాత ఏం చేసింది? ఇంతకీ ఎవరా హీరోయిన్?
Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?
Actress Jamuna
ఆ హీరోయిన్ ఎవరో కాదు జమున. గడసరి, ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న నటి, సత్యభామ పాత్రకు అచ్చు గుద్దినట్టుగా సరిపోయే తార జమున. ఆమె ఎంతటి స్టార్స్ అయినా సరే లెక్క చేసేవారు కాదట. ఎంత పెద్ద నటులు అయినా వారికి తగిన సమాధానం కూడా ఇచ్చేవారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపాలు తాపాలు.. పట్టింపులు పగలు.. స్నేహాలు వైరాలు.. ఇవన్నీ కామన్.. మాటల పట్టింపుతో ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు.. ఇప్పటికీ మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నస్టార్లు టాలీవుడ్ లో చూస్తూనే ఉన్నాం. అలాంటి సమస్యే.. అలనాటి తారలు జమును ఎన్టీఆర్ ఏఎన్నార్ ల మధ్య వచ్చాయట.
Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?
Actress Jamuna
జమున తమను లెక్కచేయకుండా చేసిన కొన్ని పనులకు ఎన్టీఆర్, ఎఎన్నార్ లకు కోపం వచ్చిందని, దాంతో వీరిద్దరు అనఫిషియల్ గా ఆమెను ఇండస్ట్రీలో బ్యాన్ చేశారని తెలుస్తోంది. అయినా సరే ఆమె ఏమాత్రం తగ్గకుండా తన పని తాను చేసుకుపోయిందట. అసలు వీరిమధ్య వచ్చిన సమస్య ఏంటి..? ఎందుకు జమునను వీరు బ్యాన్ చేశారు..? మళ్లీ సమస్య ఎప్పుడు పరిష్కారం అయ్యింది. చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిన ఈ విషయం గురించి జమున తన వెర్షన్ ను ఓ సందర్భంలో వెల్లడించారు.
Also Read: రామ్ చరణ్ ను పట్టించుకోని అల్లు అర్జున్, మరోసారి బయటపడ్డ విభేదాలు. అసలేం జరుగుతోంది?
భూకైలాస్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుందట. ఈసినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు జమున కూడా నటించింది. అయితే షూటింగ్ అంటే గంట ముందే సెట్ లో ఉంటారు ఎన్టీఆర్ ఏఎన్నార్. కాని జమున మాత్రం కాస్త లేట్ గా వచ్చేవారట. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కాని.. జమున నాలుగు గంటలు లేట్ గా షూటింగ్ కు వచ్చారు.
ఉదయ 5 గంటలకు పెద్దలు షూటింగ్ కు వస్తే.. ఉదయం పది గంటలకు ఆమె రావడంతో.. అందరికి అది నచ్చలేదు. ఆ కాలంలో ఎన్టీఆర్- ఏఎన్నార్ ఇద్దరు సెట్ లో ఉంటే.. ఎంత పెద్ద నటులైనా.. కాస్త జాగ్రత్తగా ఉండేవారు. కొంత మంది అయితే వారికి ఎదురుగా కూడా వచ్చేవారు కాదు. అంత జాగ్రత్తగా ఉండేవారు.
కాని ఇలాంటి విషయాలలో జమున మాత్రం కాస్త ఆత్మాభిమానంతో ఉండేవారట. ఎంత పెద్దవారైనా లెక్క చేసేవారు కాదట. తన పనేంటో తాను చూసుకుని.. పక్కన కూర్చునేవారట. సారి చెప్పడం అనేది జమున కెరీర్లోనే లేదని తెలుస్తోంది.
Also Read: Robinhood Twitter Review : రాబిన్ హుడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ, నితిన్ ఈసారైన హిట్ కొట్టినట్టేనా?
ఇక భూ కైలాస్ షైటింగ్ సమయంలో నాలుగు గంటలు లేటుగా వచ్చిన జమున.. అప్పటి వరకు ఆమె కోసం ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు కనీసం చిన్న సారి కూడా చెప్పకుండా .. కారుది షాట్ రెడీనా అన్నారట. దాంతో ఇద్దరు స్టార్ హీరోలకు ఓ రేంజ్ లో కోపం వచ్చేసిందట.
అప్పుడు ఇద్దరు హీరోలు మాట్లాడుకుని.. జమునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అప్పటి నుంచి జమునపై అనఫిషియల్ గా బ్యాన్ విధించారట ఇద్దరు హీరోలు. జమున కూడా తనపై స్టార్ హీరోలు పగబట్టారంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
Actress Jamuna
అయినా తగ్గలేదు జమున. వారు అవకాశాలు ఇవ్వకపోతే ఏంటి. చిన్న హీరోలలతో అయినా సినిమాలు చేసుకుంటాను అని.. మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ.. తన పని తాను చూసుకుంది జమున. కాని సారి చెప్పి తనను తాను తగ్గించుకోలేదుట. ఈక్రమంలో నిర్మాత చక్రపాణి ముందుకు వచ్చి, జమున కు ఎన్టీఆర్, ఏఎన్నార్ వివాదం పరిష్కారించారు. ఆతరువాత వీళ్ల కాంబోలో వచ్చిన సినిమానే గుండమ్మ కథ. ఈ మూవీ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Actress Jamuna
ఈసినిమాలో జయ పాత్రకు జమున తప్పించి ఎవరూ సూట్ అవ్వరు.. ఆమే కావాలి అని చక్రపాణి పట్టుపట్టుకుని కూర్చున్నారట. ఈసినిమాలో కూడా ఏన్టీఆర్ ఏఎన్నార్ కలిసి మల్టీ స్టారర్ చేయడం.. చక్రపాణి లాంటివారు పట్టుపట్టడంతో ఇద్దరు స్టార్ హీరోలు పట్టు విడిచారట. ఇక గుండమ్మకథ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అప్పటి నుంచి మళ్లీ జమునకు అవకాశాలు ఇచ్చారట ఇద్దరు స్టార్లు. మరి జమును సారి చెప్పిందా లేదా అనేది మాత్రం తెలియదు కాని.. ఇలాంటి ఎన్నో వివాదాలు.. సర్ధుబాట్లు అప్పట్లో కూడా జరిగాయి.