సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాణంలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 2023లో విడుదలైన మ్యాడ్ చిత్రం మంచి విజయం సాధించింది. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మంచి అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. యుఎస్ ప్రీమియర్ షోలు ఆల్రెడీ మొదలయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు.