James Cameron: అవతార్: ఫైర్ అండ్ యాష్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సినిమాలపై ఇప్పుడు బిలియన్ డాలర్లు పందెం కాస్తున్నారు. కానీ ఆయన ప్రయాణం చాలా కష్టాలతో మొదలైంది. కాలేజీ మధ్యలో ఆపేయడం, ట్రక్కులు నడపడం ఇవన్నీ ఒకప్పుడు కామెరాన్ జీవితంలో భాగమే. తెలుసుకోండి.
జేమ్స్ కామెరాన్ ఆగస్టు 16, 1954న కెనడాలోని ఒంటారియోలో పుట్టారు. ఆయన తండ్రి ఇంజనీర్. 1971లో కామెరాన్ కుటుంబంతో అమెరికా వెళ్లారు. మొదట ఫిజిక్స్ చదివినా, తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నారు. చివరికి చదువు పూర్తి చేయకుండానే కాలేజీ మానేశారు.
24
ట్రక్ డ్రైవర్ నుంచి ఫిల్మ్ సెట్ వరకు జేమ్స్ కామెరాన్ ప్రయాణం
కాలేజీ మానేశాక జేమ్స్ కామెరాన్ ట్రక్కులు నడుపుతూ, చిన్న చిన్న పనులు చేస్తూ స్క్రీన్‌రైటింగ్ నేర్చుకున్నారు. 1980లో ఆర్ట్ డైరెక్టర్‌గా, 1982లో పిరాన్హా IIకి డైరెక్టర్‌గా అవకాశం వచ్చినా, రెండు వారాల్లోనే ఆ సినిమా నుంచి తీసేశారు.
34
టెర్మినేటర్ జేమ్స్ కామెరాన్ తలరాతను మార్చేసింది
1984లో వచ్చిన 'ది టెర్మినేటర్' జేమ్స్ కామెరాన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ట్రూ లైస్, టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు ఆయన్ని సూపర్‌హిట్ డైరెక్టర్‌ను చేశాయి. 1977 స్టార్ వార్స్ స్ఫూర్తితో, 1997లో టైటానిక్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
కష్టాల నుంచి బయటపడి జేమ్స్ కామెరాన్ ఇప్పుడు సినిమా ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన ఆస్తి దాదాపు 1.1 బిలియన్ డాలర్లు. బిలియనీర్ అయిన కొద్దిమంది ఫిల్మ్‌మేకర్స్‌లో ఆయన ఒకరు. ఆయన కొత్త సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' తో మళ్ళీ వార్తల్లో నిలిచారు.అవతార్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 2.3 బిలియన్ వసూలు చేసింది. ఇప్పుడు అవతార్ 3 రిలీజ్ అయింది.