చాలా కామ్ గా కూల్ గా కనిపిస్తుంటాడు మహేష్ బాబు.. ఎవరితో పెద్దగా మాట్లాడడు కూడా. కానీ ఆయనలో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. మహేష్ పంచ్ వేస్తే ఎలా ఉంటుదో తెలుసా? స్టార్ కమెడియన్ అలీని స్టార్ హీరోయన్ ముందు ఎలా బుక్ చేశాడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు.. అమ్మాయిల మనసుల్లో అలా నిలిచిపోయిన ప్రిన్స్. చాలా కామ్ గా, కూల్ గా కనిపిస్తాడు, ఎవరితో పెద్దగా మాట్లాడడు, షూటింగ్స్ లో కూడా పెద్దగా హడావిడి చేయడు. తన పనేదో తాను చేసుకుంటాడు. పార్టీలు, ఫంక్షన్స్ అంటే అస్సలు నచ్చదు. సినిమా షూటింగ్ లేకపోతే.. తన టైమ్ అంతా ఫ్యామిలీకే ఇచ్చేస్తాడు మహేష్ బాబు. ఏడాదిలో తక్కువలో తక్కువ నాలుగైదు ఫారెన్ టూర్లు పక్కాగా ఉంటాయి. అది కూడా ఫ్యామిలీతోనే. చాలా రిజర్వ్డ్ గా ఉంటే మహేష్ బాబులో మరో కోణం గురించి చాలామందికి తెలియదు. ఆయన చేసే అల్లరి ఎలా ఉంటుందో తెలుసా? మహేష్ బాబు పంచ్ వేస్తే అవతలి వ్యక్తి నోట్లో నుంచి మాట కూడా రాదు. ఆయన చేసే అల్లరి గురించి చాలామంది స్టార్స్ చాలా సందర్భాల్లో వెల్లడించారు.
25
మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సీరియస్ గా కనిపిస్తాడో.. ఆయన కామెడీ టైమింగ్ కూడా అంతే అదిరిపోతుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా మహేష్ కొన్ని సందర్భాల్లో మాత్రమే.. సరదాగా ఉంటూ కామెడీ చేస్తాడు, పంచులు వేస్తాడు. కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన యాంకర్లపై సైలెంట్ గా వేసే కౌంటర్లు.. మామూలుగా ఉండవు. ఎదురుగా ఉన్నవారు ఏం అడగాలో కూడా అర్ధంకానట్టుగా.. వారి నోరు మూంచేస్తాడు మహేష్. కొన్ని సందర్భాల్లో యాంకర్ ప్రదీప్, బిత్తిరి సత్తి లాంటి వారితో జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ కామెంట్స్. పంచ్ లు మూములుగా లేవు.. తాజాగా కమెడియన్ అలీ మహేష్ బాబు అల్లరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు
35
అలీని హీరోయిన్ ముందు ఇరికించిన మహేష్ బాబు..
రీసెంట్ గా ఈటీవీ 30 ఏళ్ళ ఈవెంట్ శ్రీకాకుళంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో యాంకర్ ప్రదీప్ కమెడియన్ అలీని ప్రశ్నిస్తూ.. మీకు పరిచయం ఉన్న టాలీవుడ్ అందరి హీరోల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అని అన్నారు. దీనికి అలీ మాట్లాడుతూ... " హీరోలలో మహేష్ బాబు బాగా అల్లరి చేస్తాడు. శ్రీమంతుడు షూటింగ్ టైమ్ లో..నన్ను హీరోయిన్ మందు ఇరికించేశాడు. ఓ సారి షూటింగ్ జరుగుతుండగా.. అందరు శ్రుతి హాసన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆమె ఎంతకీ రాకపోవడంతో.. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు అని మహేష్ అన్నారు. దానికి నేనేదో సరదాగా వచ్చేస్తుంది లెండి కమల్ హాసన్ కూతురు కదా అన్నాను. ఆ అమ్మాయి సెట్ కి వచ్చిన తర్వాత మహేష్ ఆమె దగ్గరకు వెళ్లి ఇదిగో శ్రుతి అలీ ఏమంటున్నాడో తెలుసా కమల్ హాసన్ కూతురు కదా లేట్ గా వస్తుంది అంటున్నాడు అని ఆమెకు చెప్పి నన్ను ఆమెదగ్గర ఇరికించాడు అని అన్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ మూవీగా ఈసినిమాకు దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నట్టు సమాచారం. ఈసినిమాలో మహేష్ రుద్రగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన వారణాసి టైటిల్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసుకున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్కమైన పాత్రలో నటింస్తున్నారు.
55
కృష్ణ వారసుడిగా..
బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కృష్ణ వారసుడిగా ఆయన పేరును చిన్నతనంలోనే నిలబెట్టాడు మహేష్. హీరోగా మారిన తరువాత కెరీర్ బిగినింగ్ లో సరైన సక్సెస్ లభించకపోయినా.. ఆతర్వాత కాలంలో మంచి మంచి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు మహేష్. కృష్ణ లెగసీని కాపాడుకుంటూ.. తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సాధించాడు మహేష్ బాబు.