రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తికాకముందే భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో కోట్ల డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈమూవీ ఓటీటీ హక్కులు ఎవరు తీసుకున్నారు. జైలర్ 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా?
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జైలర్ 2. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని రజినీకాంత్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జైలర్2 గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ బయటకు వస్తూనే ఉంది. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించిన ఓ హాట్ న్యూస్ బయటికొచ్చింది.
సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాక ముందే, జైలర్ 2 ఓటీటీ రైట్స్ ఏకంగా 160 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ భారీ డీల్‌ను దక్కించుకుంది. తమిళ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటీటీ డీల్ అని చెబుతున్నారు.
25
రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం 'జైలర్ 2' సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కేరళలోని పాలక్కాడ్‌లోని అట్టప్పాడి, కోజికోడ్‌లో జరిగింది. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు మలయాళ ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని మొదట వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, 'జైలర్ 2' సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
35
600 కోట్లు వసూలు చేసిన సినిమా..
బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్' సినిమాకు సీక్వెల్‌గా 'జైలర్ 2' తెరకెక్కుతోంది. ఈసినిమాను కూడా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగంలో రజినీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో కనిపించారు. 2023లో రిలీజైన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా హిట్ అయినప్పటి నుంచే అభిమానులు రెండో భాగం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.
ఈ ఏడాది జనవరి 14న ఒక ప్రోమో వీడియోతో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు మూవీ టీమ్. ఆ తర్వాత మార్చిలో షూటింగ్ మొదలైంది. తమిళ సినీ ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాల్లో 'జైలర్ 2' ఒకటి అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మొదటి భాగానికి మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా మ్యూజిక్ చేస్తన్నాడు. పార్ట్ 1 లాగే రెండో భాగం కూడా ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ఉండబోతోంది. అయితే, రెండో భాగంలో మోహన్‌లాల్ చేసిన 'మాథ్యూ' అనే డాన్ పాత్ర ఉంటుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
55
రజినీకాంత్ సినిమాలు
రజినీకాంత్ చివరిగా కనిపించిన సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రజినీకాంత్‌తో పాటు నాగార్జున కీలక పాత్రలో, అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు. జైలర్ 2 తో పాటు మరికొన్ని కథలను రజినీకాంత్ వింటున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.