ఇదిలా ఉంటే బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది లయ. ఆమె `భద్రం కొడుకో` సినిమాలో బాలనటిగా మెరిసింది. ఆ తర్వాత స్వయంవరం చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. `కోదండ రాముడు`, `మనోహరం`, `మనసున్న మారాజు`, `ప్రేమించు`, `రామా చిలకమ్మ`, `నాలో ఉన్న ప్రేమ`, `హనుమాన్ జంక్షన్`, `నువ్వులేక నేను లేను`, `కొండవీటి సింహాసనం`, `నీ ప్రేమకై`, `శివరామరాజు`, `దొంగరాముడు అండ్ పార్టీ`, `పెళ్లాంతో పనేంటి`, `నేను పెళ్లికి రెడీ`, `మిస్సమ్మ`, `విజయేంద్రవర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్య చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది లయ.