Ram Charan: రాంచరణ్ ని కించపరిచేలా కామెంట్స్, క్రెడిట్ ఇవ్వని డైరెక్టర్.. ఒక్క మాటతో నోరు మూయించారు

Published : May 14, 2026, 04:07 PM IST

రాంచరణ్ ని కించపరిచేలా ఓ లెజెండ్రీ దర్శకుడు కామెంట్స్ చేశారు. రాంచరణ్ కి ఆ దర్శకుడు క్రెడిట్ ఇవ్వలేదు. ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ రాజమౌళి ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
Ram Charan

రాంచరణ్ పెద్ది మూవీ 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్  పర్సెంటేజి విధానం వివాదం వల్ల పెద్ది చిత్రం కూడా వార్తల్లో నిలిచింది. పెద్ది రిలీజ్ కి ముందే ఈ వివాదం తెరపైకి రావడంతో కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం మగధీర విషయంలో కూడా చాలా చర్చ నడిచింది. 

25
రాంచరణ్ కి నో క్రెడిట్

మగధీర సినిమా విషయంలో రాంచరణ్ కి ఏమాత్రం క్రెడిట్ లేదని చాలా మంది విమర్శించారు. క్రెడిట్ మొత్తం రాజమౌళిదే అని అన్నారు. మగధీర చిత్రాన్ని అల్లు అరవింద్ 40 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించగా రాజమౌళి ఈ చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంలాతెరకెక్కించారు. రాంచరణ్ యోధుడిలా చేసిన పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.

35
చరణ్ ని కించపరిచేలా కామెంట్స్

ఈ మూవీలో రాంచరణ్ హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అయినప్పటికీ ఓ లెజెండ్రీ దర్శకుడు రాంచరణ్ ని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఆ లెజెండ్రీ దర్శకుడు ఎవరో కాదు దాసరి నారాయణరావు. రాజమౌళి, శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు అని దాసరి అన్నారు. ఆయన చెప్పింది నిజమే కదా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అన్నారు.

45
సినిమాని అందంగా తీయడమే నా బాధ్యత

రాజమౌళి స్పందిస్తూ..  నేను అలా అనుకోవడం లేదు. మగధీర సినిమా బాగా రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత కష్టపడినా, ఎన్ని టెన్షన్స్ పడినా డైరెక్టర్ పాత్ర సినిమాని అందంగా తీయడం వరకే. ఆ సినిమా కోట్లు కోట్లు కలెక్షన్స్ రాబట్టింది అన్నా, రికార్డులు బద్దలు కొట్టింది అన్నా ఆ క్రెడిట్ 80 శాతం స్టార్ కే చెందుతుంది. ఎందుకంటే స్టార్ ని చూసే జనాలు థియేటర్ కి ఎగబడి వస్తారు. ఆ క్రేజ్ ని వాడుకునే తెలివి నిర్మాతకు ఉండాలి.

55
రికార్డులు మొత్తం హీరోకే చెందుతాయి

ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మంచి సినిమా లేకపోతే ఏమీ చేయలేరు అని రాజమౌళి అన్నారు. నేను ఈ స్టేజీకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ భజన చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ సినిమా రికార్డులు స్టార్స్ కే చెందుతాయి అని రాజమౌళి అన్నారు. రాంచరణ్ చిరంజీవి కొడుకు కాబట్టే ఆ క్రేజ్ వచ్చింది అని యాంకర్ అనగా.. తొలి చిత్రంతోనే రాంచరణ్ కి  విపరీతమైన స్టార్ స్టేటస్ వచ్చేసింది అని రాజమౌళి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories