6 రూపాయల రెమ్యునరేషన్‌తో 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన నవ్వుల రారాజు

Published : Oct 14, 2026, 07:53 AM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్, 400 సినిమాల్లో నటించిన రికార్డు, హావభావాలతోనే నవ్వించగల టాలెంట్, తెర వెనుక మాత్రం ఎన్నో కష్టాలు చూసిన నటుడు. జీరో నుంచి వందల కోట్లు సంపాదించిన స్టార్ ఎవరో తెలుసా?

PREV
14
400కి పైగా చిత్రాలలో నటించి

ఇండియన్ సినిమా చరిత్రలో తమదైన హాస్యంతో, విచిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన కామెడీ నటులు కొందరే ఉంటారు. వారిలో ముందువరుసలో ఉండే పేరు 'జగదీప్'. వెండితెరపై కోట్లాది మందికి వినోదాన్ని పంచిన ఈ హాస్య చక్రవర్తి జీవితం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లతో కూడిన పోరాటాలు.. దాగి ఉన్నాయి. సుమారు ఏడు పదుల సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో నటించి సరికొత్త రికార్డు సృష్టించారు.

24
'షోలే' సినిమాలో

జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. సినీ పరిశ్రమలో జగదీప్‌గా ఫేమస్ అయ్యారు. ఆడియన్స్ కు ఆయన అనగానే గుర్తుకువచ్చే పేరు "సూర్మా భోపాలి". అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'షోలే' సినిమాలో ఆయన పోషించిన సూర్మా భోపాలి పాత్ర భారతీయుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. ఆయన ముఖకవళికలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆ పాత్రను ప్రజల హృదయాల్లో నిలిపాయి.

34
6 రూపాయల పారితోషికం

1939లో జన్మించిన జగదీప్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబ బాధ్యతలు తలపై పడటంతో చదువుకోవాల్సిన వయసులోనే ముంబైకి వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు. బి.ఆర్. చోప్రా దర్శకత్వం వహించిన 'అఫ్సానా' సినిమా ద్వారా బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆయనకు లభించిన తొలి పారితోషికం కేవలం 6 రూపాయలు మాత్రమే.

ఆ తర్వాత 'దో బీఘా జమీన్', 'హమ్ పంఛీ ఏక్ డాల్ కే' వంటి చిత్రాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయి. 'హమ్ పంఛీ ఏక్ డాల్ కే' చిత్రంలో జగదీప్ కనబరిచిన అద్భుత నటనకు ముగ్ధుడైన అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ తన సొంత పెన్నును బహుమతిగా అందించారు.

44
మూడు పెళ్లిళ్లు.. కోట్ల ఆస్తి.. ‌

జగదీప్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య నసీం బేగం ద్వారా హుస్సేన్, షకీరా, సురైయా జన్మించారు. రెండో భార్య సుఘ్రా బేగం కుమారులు జావేద్ జాఫ్రీ, నావేద్ జాఫ్రీ ఇద్దరూ ప్రముఖ డాన్స్ షో 'బూగీ వూగీ' ద్వారా భారతీయ టీవీ రంగంలో సంచలనం సృష్టించారు. మూడో భార్య నజీమా ద్వారా ముస్కాన్ అనే కుమార్తె ఉంది.

జీరోతో జీవితాన్ని ప్రారంభించిన జగదీప్, తన కష్టార్జితంతో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారు. 2020 జూలై 8న, 81 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. నటనతోనే కాకుండా ఐకమత్యం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపిన జగదీప్, భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నవ్వుల రారాజు.

Read more Photos on
click me!

Recommended Stories