Jailer 2 Review: రజనీకాంత్ హీరోగా నటించిన `జైలర్ 2` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ప్లస్ లే కాదు, మైనస్‌లు కూడా కలవరపెడుతున్నాయి.
రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `జైలర్ 2`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే ఎస్ జే సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీ పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు `జైలర్ 2`పై భారీ అంచనాలున్నాయి. మరి సినిమా ఎలా ఉందబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది.
25
జైలర్ 2 సెన్సార్ టాక్
`జైలర్` 2 మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికెట్‌ని పొందింది. 16 ఏళ్లకుపైబడ్డ వాళ్లు సినిమా చూడొచ్చు. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలు ఉంటుందని తెలిసింది. ఇది డీసెంట్ నిడివి అనే చెప్పొచ్చు. ఇక సెన్సార్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చినట్టు సమాచారం. కానీ రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఆయా సీన్లలో హింసని తగ్గించాలని తెలిపారట. కొన్ని సీన్లని మార్చాలని వెల్లడించారట. అభ్యంతకర డైలాగ్‌లను మ్యూట్ చేయాలని వెల్లడించారట. ఇలా కొన్ని కండీషన్లు పెట్టడంతో టీమ్ ఓకే చెప్పింది. కొన్ని డైలాగ్‌లు, రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలకు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం మయ్యాయి. అలా సుమారు 15సెకన్లపాటు కట్ విధించినట్టు సమాచారం.
35
జైలర్ 2 కథ ఇదే
జైలర్ 2 కథ ఏంటనేది చూస్తే, రజనీకాంత్ రిటైర్డ్ జైలర్. ఆర్థిక సమస్యలతో ఉన్న తన కుటుంబాన్ని పార్ట్ టైమ్ కార్ వాషింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ సపోర్ట్ గా ఉంటాడు. మాదకద్రవ్యాల మాఫియా నుంచి తన కోడలు మిర్నా, మనవడు రిత్విక్, భార్య రమ్యకృష్ణలకు ప్రాణ హానీ ఉంటుంది. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో మిథున్ చక్రవర్తి, ఆయన కొడుకు ఎస్ జే సూర్య, కోడలు విద్యాబాలన్ నిర్వహించే దందాలో భాగమవుతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో తిరుగుబాటు చేస్తాడు. పరిస్థితులు చేయి దాటే పరిస్థితుల్లో మరోసారి మోహన్‌లాల్, శివరాజ్ కుమార్‌లా సహాయం తీసుకుంటాడట. ఈ క్రమంలో ఇందులో హృతిక్, విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా ఉంటుందని సమాచారం. వరుస ట్విస్ట్ లు ఆశ్చర్యపరుస్తాయని తెలుస్తోంది.
సినిమా ఫస్టాఫ్ డార్క్ హ్యూమర్, రజనీకాంత్ మాస్ ఎలివేషన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్టాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. ముత్తువేల్ పాండియన్ గా రజనీకాంత్ మరోసారి దుమ్ములేపాడని చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్ గుస్‌బంమ్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో రెండు బలమైన ట్విస్టు లు ఉంటాయని, క్లైమాక్స్ లో వచ్చే హృతిక్ రోషన్ సీన్స్ హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తుంది. హీరోల పాత్రలతోపాటు విలన్ పాత్ర కూడా హైలైట్‌గా నిలుస్తుందంటున్నారు. దీనికితోడు అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ మరో హైలైట్ అవుతుందని సమాచారం. బీజీఎంతో సినిమా నడిచిపోతుందని చెబుతున్నారు.
55
జైలర్ 2ని కలవరపెట్టే అంశం
ఇదిలా ఉంటే కొంత నెగటివ్ టాక్ కూడా ఉంది. సీక్వెల్ చాలా బలవంతంగా తీసినట్టుగా ఉందని, డ్రామా అంతగా పండలేదని చెబుతున్నారు. గెస్ట్ రోల్స్, ట్విస్ట్ లు అంతగా పండలేదంటున్నారు. మొదటి భాగం స్థాయిలో లేవని టాక్. అనిరుద్ బీజీఎం కూడా రొటీన్‌గానే ఉంటుందని చెబుతున్నారు. రజనీకాంత్ నిలబడి నటించాడు, యాక్షన్‌లో ఆయన చేసిందేం లేదని చెబుతున్నారు. ఇలా కొంత నెగటివ్ టాక్ కూడా ఉంది. మరి సినిమా రియల్‌గా ఎలా ఉంటుందనేది ఏసియానెట్ ఒరిజినల్ రివ్యూలో చూడండి.