ఈలోగా మిషిన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అత్త, మామ, భర్త. వాళ్ల దగ్గరికి వెళ్లి భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది ధరణి. మహేంద్ర వచ్చాక చేస్తాను ఈ లోపు నేను వీళ్ళతో కాసేపు మాట్లాడాలి నువ్వు వెళ్ళమ్మా, అవసరమైతే పిలుస్తాను అని చెప్తాడు ఫణీంద్ర. వీళ్లు ఇప్పుడప్పుడే వచ్చేటట్లుగా లేరు ఇదే సరైన సమయం అని జగతి దగ్గరికి వెళ్లి మీతో మాట్లాడాలి అని కంగారుగా రూమ్ కి తీసుకువెళ్లిపోతుంది.