Spy Movie Review: ‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్ వన్ మ్యాన్ షో... వర్కౌట్ అవుతుందా..?

First Published Jun 29, 2023, 5:24 AM IST

డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మంచి జోరు మీద ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోయేలా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా నిఖిల్ నటించిన  లేటెస్ట్ మూవీ  ‘స్పై’. ఈరోజు (29 జూన్ ) థియేటర్లలో  గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందే ప్రిమియర్స్ సందడి చేయగా.. ఫారెన్ లో ఈసినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. మరి వారేమంటున్నారో చూద్దాం. 

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తీకేయ 2’ రిలీజ్ తర్వాత నిఖిల్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈక్రమంలో స్పై మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నిఖిల్.  యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన స్పై సినిమాకు  గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. 

ఇక ఈ మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. స్పై సినిమాపై పాజిటీవ్ రివ్వూస్ వినిపిస్తున్నాయి. సినిమా చాలా బాగుంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. ముఖ్యంగా సినిమా లైన్..  బాగుంది అంటున్నారు. ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ను తీసుకోవడంతో.. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. 

Latest Videos


నేతాజీ ఫైల్స్ చుట్టు తిరిగే కథ బాగా ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను.. సస్పెన్స్ ను పెంచుతూ వచ్చింది. అయితే వాటికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ లో క్వాలిటీ పెంచితే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఈసినిమా లొకేషన్లకు తగ్గట్టుగా విజ్యువల్స్ అంత అద్భుతంగా అనిపించడం లేదు అంటున్నారు. 

అంతే కాదు స్పై మూవీలో నిఖిల్ తప్పించి మిగతా నటీనటులు సినిమాకు పెద్దగా ఉపమోగపడలేదు అన్న అభిప్రాయం ట్విట్టర్ జనాలు వెల్లడిస్తున్నారు. మరీ మూఖ్యంగా.. నిఖిల్ ఈసినిమాకు వన్ మ్యాన్ షో చేసినట్టుగా ట్వీట్ చేస్తున్నారు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టే ఉన్నాయన్నఅభిప్రాయం వినిపిస్తోంది. నిఖిల్ తో పాటు టీమ్ అంతా  సపోర్ట్ చేసి ఉంటే.. సినిమా వేరే లెవల్ లో ఉండేది అంటున్నారు. 
 

నిఖిల్ సిద్దార్థ్ ఎంత కష్టపడ్డా.. అతనికితో పాటు చుట్టు ఉన్న నటీనటుల సపోర్ట్ కూడా అవకసరమే. ఈ సినిమా విషయంలో.. ఎవరూ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేసిన వాళ్లు లేరు అంటున్నారు ట్విట్టర్ జనాలు. సినిమా అంతా ఒక వేవ్ లా వెళ్ళిపోతుంది.. పెద్దగా ట్విస్ట్ లు.. ఇంట్రవెల్ బ్యాంగ్ తో అరిపించడాలు.. క్యూరియాసిటీలు పెంచడాలు లాంటివి సినిమాలోకి వెళ్ళిన తరువాత పెద్దగా అనిపించలేదంటున్నారు. 

ఇక ఈసినిమాకు మ్యూజిక్ ప్లాస్ అయ్యిందనే అనుకోవాలి. బీజియం బాగా వర్కౌట్ అయ్యింది. అయితే.. సినిమా అంతా చంద్రబోస్ చుట్టు తిప్పే క్రమంలో.. ఇతర విషయాలు వదిలేశాడు దర్శకుడు. దాంతో సినిమాపై ఆడియన్స్ కు గ్రిప్ దొరికే అవకాశం లేదు. ఇక ఈసినిమా ఓవర్ ఆల్ గా పర్వలేదు అనిపిస్తోంది. మరి రిలీజ్ తరువాత ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.

click me!