విడాకులు తీసుకోబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు దంపతులు.. ట్విస్ట్ ఏంటంటే..?

Published : Jun 29, 2023, 06:54 AM IST

ఈమధ్య వెండితెరపై విడాకులు కేసులు ఎక్కువైపోయాయి. వెండితెర తారలు, బుల్లితెర తారలు కూడా ఇలా పెళ్లి చేసుకుని.. అలా విడాకులు తీసుకుంటున్నారు. 

PREV
15
విడాకులు తీసుకోబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు దంపతులు.. ట్విస్ట్ ఏంటంటే..?

పెళ్లైన తరువాత అతి త్వరగా విడాకులు తీసుకున్న బుల్లితెర తారలు చాలా మంది  ఉన్నారు. అందులో నోయల్ లాంటివారు ప్రేమ పెళ్లి చేసుకుని మరీ.. విడాకులు తీసుకున్నారు. అటు వెండితెరపై కూడా విడాకుల కేసులు తక్కువేమి కాదు. పెళ్లిళ్లు ఎంత ఫాస్ట్ గా చేసుకుంటున్నారో.. విడాకులు కూడా అంతే ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. తాజాగా మరో బుల్లితెర స్టార్ డివోర్స్ కు రెడీ అవుతున్నాడు. 

25

బుల్లితెరపై ఎక్కవగా ప్రేక్షకాదరణ ఉన్న కార్యక్రమాలలో..  కామెడీ షో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉండి...తిండికి కూడా కష్టపడ్డ ఆర్టిస్టు లు స్టార్స్ గా మారారు. అటువంటివారిలో పటాస్ ద్వారా ఫేమస్ అయిన యాదమ్మ రాజు కూడా ఒకరు.  జబర్దస్త్ తో పాటు..  శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోలలో తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తున్న యాదమ్మ రాజుకు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

35

యాదమ్మ రాజు గతేడాదే పెళ్లి చేసుకున్నాడు.  స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్ళి తరువాత కూడా వీరి వీడియోలు చేస్తూ.. చాలా అన్యోన్యంగా ఉన్నారు. యాదమ్మ రాజు ఇంట్లో వాళ్లతో కూడా స్టెల్లా బాగా కలిసిపోయి.. అతని పరిస్థితి అర్ధం చేసుకుని ఉంటన్నట్టుగా వీడియోలలో చూపించారు. 

45

ఇలా వారి  వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. ఈ విషయం విన అంతా  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా..? ఒకరికి మరొకరిగా ఉన్న ఈ జంట నిజంగా విడిపోబోతుందా..? ఈ విషయంలో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. 

55

బుల్లితెరపై కామెడీ టైమింగ్ కు పెట్టిందిపేరు రాజు. షోకోసం అప్పుడప్పుడు చమత్కారాలు చేయడంలో కూడా అతను దిట్టే. అలాగే  ఒక బుల్లితెర కార్యక్రమం కోసం ఇలా విడాకులు థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ జంట. పాపులర్ కామెడీ షో... శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం సరికొత్త థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఈసారి వీరు తమ విడాకులు అంటూ.. అందరిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories