ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) ను డిస్టర్బ్ చేస్తున్నందుకు గాను జగతి (Jagathi) సాక్షి ని చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుని వస్తుంది. దాంతో దేవయాని జగతి ఎక్కువ చేస్తున్నావ్ అని అంటుంది. సాక్షి అంతకన్నా ఎక్కువ చేస్తుందని జగతి అంటుంది. ఇక తల్లిగా నాకు అధికారం ఉంది అని సాక్షి చంప మీద కొట్టినట్లు చెబుతోంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటకు వెళ్ళక పోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది.