Karthika Deepam: హిమకు క్యాన్సర్ అని నిజం తెలుసుకున్న సౌందర్య, ఆనంద్ రావు.. నిరుపమ్ షాకింగ్ నిర్ణయం?

Published : Jun 09, 2022, 08:08 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: హిమకు క్యాన్సర్ అని నిజం తెలుసుకున్న సౌందర్య, ఆనంద్ రావు.. నిరుపమ్ షాకింగ్ నిర్ణయం?

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే బావ అమెరికా వెళితే మరి సౌర్య (Sourya) పరిస్థితి ఏమిటి? అని హిమ (Hima) ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టెన్షన్ లో హిమ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక హిమ తన ఇంటికి వెళ్లగానే..  తను తీసుకునే సొంత నిర్ణయాలకు గాను  సౌందర్య రావమ్మా మహాలక్ష్మీ అంటూ  హిమను దెప్పిపొడుస్తుంది.
 

26

ఆ తర్వాత కూతుర్ని అల్లున్ని శోభ (Sobha) కలిపింది..  దాంతో శోభ ను స్వప్న (Swapna) ఆకాశానికి ఎత్తేస్తుంది అని సౌందర్య దంపతులు అంటారు. ఇక అందరూ ఒక్కటై శోభను నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు అని సౌందర్య హిమ కు చెబుతుంది. ఇక ఇదె క్రమంలో సౌందర్య హిమను నానా రకాలుగా దెప్పి పొడుస్తుంది. ఇక ఇప్పటికైనా చెప్పమ్మా నీ మనసులో ఏముందో.. అని అడుగుతారు.
 

36

ఇక ఆనందరావు (Anand Rao) హిమ..  నీకు దండం పెడతాను నిరుపమ్ (Nirupam) ను ఎందుకు వద్దంటున్నావో చెప్పమ్మా అంటూ బ్రతిమిలాడాడు. ఇక హిమ మీ అందరి ప్రశ్నలకి ఇందులో సమాధానాలు ఉన్నాయి అని తన క్యాన్సర్ రిపోర్ట్ ను సౌందర్య దంపతులకు ఇస్తుంది. అది చదివిన సౌందర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా వలవల ఏడుపు కొనసాగిస్తుంది. ఇక క్యాన్సర్ రిపోర్ట్ చూసిన నిరుపమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు.
 

46

ఇక నీకేం కాదు హిమ (Hima) అంటూ ఆ రిపోర్ట్ ను కోపంతో చించేస్తాడు. ఇక హిమ ఈ విషయం జ్వాల (Jwala) కు చెప్పొద్దూ అని నిరుపమ్ ను ప్రామిస్ చేయమని అడుగుతుంది. ఇక నాకు ఇలా క్యాన్సర్ అని తెలిస్తే తను తట్టుకోలేదు బావ అంటూ ఏడుస్తుంది. ఇక మన ప్రేమ విషయం కూడా చెప్పకు బావ అని అంటుంది. ఇక నిరుపమ్ ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ ఆ అని కోపం పడతాడు.
 

56

ఇక హిమ (Hima) నన్ను మర్చిపో బావ అని అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ నిరుపమ్ (Nirupam) ఏడుస్తూ ఉంటాడు. ఇక నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో బావ నా ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది. ఇక ఆ మాటతో నిరుపమ్ షట్ అప్ అంటూ విరుచుకు పడతాడు. మరోవైపు సత్య ప్రేమ్ లు హిమ క్యాన్సర్ గురించి సింపతి చూపిస్తూ ఉంటారు. ఇక సౌర్య నిరుపమ్ ఫోటోలు చూసుకుంటూ ఉంటుంది.
 

66

ఇక తరువాయి భాగంలో సౌర్య (Sourya) చేతికి హెచ్ అనే అక్షరం చూసి..  శోభ (Sobha) ఎవరి పేరు అని అడుగుతుంది. అది నా శత్రువు పేరు అని సమాధానం చెబుతుంది. ఒక వైపు నిరుపమ్ ఈరోజు నుంచి హిమ ను నేనే చూసుకుంటాను. అంతేకాకుండా ఒక భర్త లాగా చూసుకుంటాను అని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. నిరుపమ్ హిమను తప్పకుండా పెళ్లి చేసుకుని తీరుతాను అంటాడు.

click me!

Recommended Stories