నయనతార, రోజా , సోనాలి బింద్రే, అమలా పాల్... దర్శకులను పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు ఇంకెవరో తెలుసా..?

Published : Jun 09, 2022, 07:54 AM ISTUpdated : Jun 09, 2022, 08:00 AM IST

పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అటారు. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటే వారి పెళ్ళాడతారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్శు మాత్రం ఎవరు ఎవరితో చేసుకుంటారో ఊహకు అందటం కూడా కష్టమే. మూడు సార్లు ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్ నయనతార చివరకు తనకంటే చిన్నవాడైన యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడుతుంది. ఇలా ఇండస్ట్రీలో దర్శకులను పెళ్ళాడిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.  

PREV
110
నయనతార, రోజా , సోనాలి బింద్రే, అమలా పాల్... దర్శకులను పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు ఇంకెవరో తెలుసా..?

తనతో సినిమాలు చేసిన విఘ్నేష్ తో  జీవితాన్ని పంచుకోవడానికి రెడీ అవుతోంది నయనతార. ప్రస్తుతం నయనతార.. గతంలో మాత్రం చాలా మంది స్టార్ హీరోయిన్లు.. డైరెక్టర్లతో జీవితాన్ని పంచుకున్నారు. అందులోకొన్ని బంధాలు ఇప్పటికీ కొనసాగుతుంటే... మారికొంత మంది మాత్రం వివాహ బంధానికి ముగింపు పలికారు. మరి  దర్శకులతో జీవితాన్నిపంచుకుంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరు...?

210

దాదాపు ఆరేళ్లుగా  నయనతార, విఘ్నేష్ శివన్‌లు ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం డేలీ ఎసిపోడ్‌ల బంకలా కొనసాగుతూనే ఉంది. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార, హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి పీఠలకు వరకు వెళ్లింది. చివరకు ఏమైందో ఏమో వీళ్ల పెళ్లికి చివరల్లో శుభం కార్డు మాత్రం పడలేదు. తాజాగా విఘ్నేష్‌తో ప్రేమను పెళ్లితో ఎండ్ కార్డ్ వేయాబోతోంద. వీరి పెళ్లి ఈరోజు  (జూన్ 9) గ్రాండ్ గా జరగబోతోంది. 

310

 నయనతార మాదిరిగానే చాలా మంది హీరోయిన్లు దర్శకులను పెళ్ళాడారు అందులో మాజీ హీరోయిన్.. ప్రస్తుత మంత్రి రోజా కూడా ఉన్నారు. రోజా  హీరోయిన్‌.. సెల్వమణి సినీ దర్శకుడు. ఐనా వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రోజా తన భర్త సెల్వమణి దర్శకత్వంలో తమిళంలో   ఎక్కువ సినిమాలు చేసింది.  ఆ తర్వాత రోజా ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 

410

తమిళంలో అగ్ర దర్శకుడిగా సత్తా చాటుతున్న ఏ.ఎల్.విజయ్‌ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులకు ఆమెకు మధ్య  సినిమాల విషయంలో ఏదో ఇష్యూ వచ్చింది. దీంతో విజయ్‌కు అమలా పాల్ విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరు ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు.

510

హిందీతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా రాణించిన సోనాలి బింద్రే. స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ సోనాలీకి అప్పట్లో ఉండేది. ఆమె నటన అంటే పడిచచ్చేవారు చాలా మంది. ఆమె  ప్రముఖ నిర్మాత, దర్శకుడు గోల్డీ బెహె‌ల్‌ను పెళ్లి చేసుకుంది. ఆ మధ్య కాన్సర్ తో పోరాటం చేసిన సోనాలీ.. తన భర్త వల్లే కోలుకున్నానంటూ.. సోషల్ మీడియాలో తెగ పొగిడేసింది. 

610

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది కల్యాణి. తెలుగులో నాగార్జున నిర్మాతగా సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యం మూవీతో మెగాఫోన్ పట్టుకున్నారు సూర్య కిరణ్. అతను  కళ్యాణిని ప్రేమ పెళ్లి  చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు మనస్పర్థలతో విడిపోయారు
 

710

హీరోయిన్‌ రమ్యకృష్ణను ప్రేమ వివాహాం చేసుకున్నాడు స్టార్ డైరెక్టర్  కృష్ణవంశీ. ఆయన దర్శకత్వంలో హీరోయిన్‌గా  చంద్రలేఖ సినిమాలో నటించింది సీనియర్ హీరోయిన్.  ఆ తర్వాత ఇరువురి మనుసులు ఒక్కటయ్యాయి... పెళ్లి వరకూ వెళ్లారు. 
 

810

హీరోయిన్‌ యామీ గౌతమ్‌  పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యతో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులతో ఒకటయ్యారు. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది. 
 

910

ప్రముఖ నటి 7 జీ బృందావన్ కాలనీ ఫేమ్ హీరోయిన్  సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్.  7 జీ బృందావన్ కాలనీ  సినిమా టైమ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇక తరువాత వీరిద్దరు  విడాకులు తీసుకున్నారు.

1010

వీళ్ళే కాదు అప్పట్లో ఒక ఊపు ఊపిన సుహాసిని  డైరెక్టర్ మణిరత్నం ను  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  హీరోయిన్ కుష్బు డైరెక్టర్ సుందర్ ను పెళ్లాడారు, సీనియర్ హీరోయిన్ రేవతీ కూడా నటుడు, దర్శకుడు సురేష్ మీనన్ ను పెళ్ళాడాడు. ఇలా చాలా మంది స్టార్స్ దర్శకులను పెళ్ళి చేసుకున్నవారు ఉన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories