Guppedantha Manasu: మా నాన్నకు మంచి భార్యగా ఉండండి అంటూ జగతికి చెప్పిన రిషీ.. తర్వాత రోజు అందరికి షాక్!

Published : Apr 15, 2022, 10:03 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: మా నాన్నకు మంచి భార్యగా ఉండండి అంటూ జగతికి చెప్పిన రిషీ.. తర్వాత రోజు అందరికి షాక్!

జగతి (Jagathi) నన్ను ఏ హోదాలో మీ ఇంటికి రమ్మంటున్నావు అని రిషి ను అడుగుతుంది. దాంతో రిషి డాడీ అంటే నాకు ఇష్టం డాడికి మీరంటే ఇష్టం. మన ఇద్దరి మధ్యలో డాడీ నలిగిపోతున్నారు. అలా కావడం నాకిష్టంలేదు అందుకే ఇలా చేశాను అంటాడు. అదే క్రమంలో రిషి (Rishi) డాడీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ ఒకటి తప్ప అని అంటాడు.
 

26

దాంతో జగతి (Jagathi) ఆ ఒకటి నన్ను అమ్మగా ఒప్పుకోవు అంతే కదా అని మనసులో అనుకుంటుంది. అదే క్రమంలో రిషి మీరు డాడీ కోసం ఉండిపోండి లేకుంటే వెళ్లిపోండి అని తెగేసి చెబుతాడు. ఇక జగతి మహేంద్ర (Mahendra) మీద నాకు ఎంత ప్రేమ ఉందో పరీక్ష పెడుతున్నావా? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి లోకి నెట్టేసావు అని మనసులో అనుకుంటుంది.
 

36

ఇక రిషి (Rishi) మా డాడీకి మీరు ఒక మంచి భార్యగా ఉంటారని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జగతి తర్వాత రోజు ఇంట్లో కనిపించదు. మహేంద్రతో కలిసి ఫ్యామిలీ అంతా కంగారు పడతారు. ఇక దేవయాని (Devayani) చెప్పకుండా వెళ్లిపోయిందని ఫనింద్ర తో చెబుతుంది. తనకు ఇక్కడ ఉండే అర్హత లేదని తనకు అర్థం అయిపోయింది అని దేవయాని అంటుంది.
 

46

ఇక ఈలోపు జగతి (Jagathi) తన లగేజీ తో సహా వసును కలుపుకొని వస్తుంది. అంతేకాకుండా రాత్రి వసును చూడాలనిపించి వెళ్లాను అని అంటుంది. ఇక జగతి లోపలకు వస్తుండగా.. ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. దేవయాని (Devayani) మాత్రం మొత్తానికి ఉండదానికే వచ్చేసింది అని అనుకుంటుంది. 
 

56

ఇక వసు రిషి ( Rishi) సార్ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని ఆనందంగా ఫీల్ అవుతుంది. మరోవైపు రిషి వసును నా మధ్య దూరం తగ్గిందా అని అనుకుంటాడు. ఇక వసు (Vasu) రిషి సార్ మనసులో ఏమైనా అనుకుంటున్నారా అని మనసులో అనుకుంటుంది.
 

66

ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) వసు చేతిలో బుక్ లాక్కొని  లంచ్ చేద్దాం పదా అని వసు (Vasu)ను అక్కడి నుంచు తీసుకొని వెళ్తాడు. కానీ వసుకు ఏమీ అర్ధం కాదు.

click me!

Recommended Stories