టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో పూజా హెగ్డే కూడా ఒకటి. కాని ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోంది పూజా. బాలీవుడ్ లో సెట్ అవుతున్నా అనుకున్న టైమ్ లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి బ్యూటీకి.
వరసగా సినిమాలుతో సందడి చేస్తోంది పూజా హెగ్డే. పూజ హెగ్డే సినిమాలు వరుసగా థియేటర్స్ కి వస్తున్నాయి. కాని అందులో సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు పూజాకు నిరాశే మిగిల్చాయి. దాంతో పూజా ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది.
26
ఆమధ్య పూజా ప్రభాస్ జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ..పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దాంతో ఆమె అభిమానులంతా బీస్ట్ పై దృష్టి పెట్టారు. ఈ సినిమాతో అయినా హిట్ కొడుతుందనుకున్నారు.
36
విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేసిన బీస్ట్ సినిమాలో దళపతి సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే చేసిన ఈ సినిమా, భారీ స్థాయిలో.. ఏప్రిల్ 13న ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పూజ చాలా గ్లామరస్ గా కనిపించింది. కాని సినిమా మాత్రం సక్సెస్ అవ్వలేదు.
46
విజయ్ చేసే యాక్షన్ .. కమెడియన్స్ చేసే కామెడీని చూస్తుండటం తప్ప ఈసినిమాలో పూజా హెగ్డే కు పెద్దగా చోటులేకుండా పోయింది. అసలు ఆమెకు పెర్ఫామెన్స్ చేసే అవకాశమే ఇవ్వలేదు. దాంతో పూజాతో పాటు ఈ సినిమాపై కూడా రకరకాలు గా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
56
ఈ మాత్రం పాత్ర కోసమేనా పూజ ఇంత హడావిడి చేసింది? ఇంటర్వ్యూలలో పూజ చేసిన సందడి చూసి ఆమె క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకున్నాం అంటూ ... నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
66
స్టార్ హీరో తో ఛాన్స్ రావడంతో సినిమా ఒప్పేసుకున్న పూజా హెగ్డే.. తన పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచించలేదు. కాని దీని వల్ల ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అటు మేకర్స్ కూడా హీరోయిన్ ను ఇలా ఓ గ్లామర్ పీసు లా వాడుకోవడం ఏంటీ..? అంటూ విమర్షలు వస్తున్నాయి.