ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర, మహేంద్ర ఇలా చేశాను అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను రిషి అని అంటాడు. అప్పుడు రిసి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మీరు వెళ్లిన పని ఏమైంది పెద్దనాన్న అని అడగగా అప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ గురించి అక్కడి వాళ్ళతో మాట్లాడాను వారు చాలా ఆసక్తిగా ఉన్నారు అని అంటాడు ఫణీంద్ర. అందుకు సంబంధించిన వివరాలు మనకు తొందర్లోనే తెలుస్తాయి రిషి అని అంటాడు. అప్పుడు ఫణీంద్ర రిషి నువ్వు మహేంద్ర వాళ్ళ గురించి బాధపడకు ఎందుకు వెళ్లిపోయారు అనేదానికంటే ఏం చేస్తే ఇంటికి వస్తారు అన్న విషయం గురించి నిదానంగా ఆలోచించు అని చెబుతాడు.