అక్కడ సౌర్య ను చూసిన సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లడంతో మోనిత అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. మరొకవైపు మోనిత తో గొడవ పెట్టుకోవడానికి దీప ఇంట్లో రెడీగా కూర్చుని ఉంటుంది. అప్పుడు దీప మోనిత తో గొడవ పెట్టుకుంటాను అంటే డాక్టర్ బాబు ఏమీ అనడం లేదు అంటే కచ్చితంగా గతం గుర్తుకు ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. ఇప్పుడు దీప కావాలనే కార్తీక్ ని చెక్ చేయడం కోసం మోనిత, కార్తీక్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని పగలగొడుతూ ఉండగా కార్తీక్ ఆపుతాడు. అప్పుడు దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. మరొకవైపు సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లి ఇన్ని రోజులు ఊరేగింది చాలు ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది.