జగపతి బాబు పేరు వెనుక రహస్యం, అసలు పేరు వెల్లడించిన సీనియర్ హీరో

Published : Aug 17, 2025, 09:09 AM IST

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తన మార్క్ చూపించిన జగపతి బాబు.. తాజాగా హోస్ట్ అవతారం ఎత్తాడు. ఈసందర్భంగా ఆయన తన పేరు వెనుక రహస్యాన్ని ఓ వీడియోలో వెల్లడించారు.

PREV
15

ఫ్యామిలీ హీరో జగపతిబాబు

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో అనగానే జగపతి బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. తెలుగులో మహిళా ప్రేక్షకుల తమ ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లగలిగే సినిమాలు జగపతి బాబు నుంచి వచ్చేవి. కుటుంబ కథలతో అద్భుతమైన సినిమాలు చేశాడు ఈ హీరో. పెళ్లి పీటలు, మావిచిగురు, ఆయనకిద్దరు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగపతి బాబు నుంచి వచ్చిన కుటుంబ కథా చిత్రాలు చాలా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాలతో పాటు అంత:పురం లాంటి మాస్ సినిమాల్లో కూడా నటించారు జగపతి బాబు. హీరోగాటర్మ్ అయిపోయిన తరువాత కొంత కాలం గ్యాప్ ఇచ్చిన జగపతి బాబు.. ఆతరువాత పవర్ ఫుల్ విలన్ గా అవతారం ఎత్తాడు. నెగెటీవ్ రోల్ లో జగపతి బాబు ను కొత్తగా చూసి షాక్ అయ్యారు ఆడియన్స్. కెరీర్ ను డిఫరెంట్ గా టర్న్ చేసుకున్న ఈ ఫ్యామిలీ హీరో.. విలన్ గా కూడా తన సత్తా చూపించాడు.

DID YOU KNOW ?
పెద్ది సినిమాలో
రంగస్థలం సినిమాలో విలన్ గా అద్భుతం చేసిన జగపతిబాబు, మరోసారి పెద్ది సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా సందడి చేయబోతున్నారు.
25

విలన్ గా పవర్ ఫుల్ రోల్స్

హీరో ఇమేజ్ కు ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేశాడు జగపతి బాబు. ఇక తాజాగా ఆయన హోస్ట్ అవతార ఎత్తాడు. వరుసగా సినిమాలు చేసిన ఆయన తాజాగా టెలివిజన్ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు జగపతి బాబు. మరోవైపు, 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే కొత్త టాక్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఈరోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రసారానికి సిద్ధమవుతోంది.

35

పేరు వెనుక రహస్యం వెల్లడించిన జగపతిబాబు

ఈక్రమంలో తాజాగా జగపతిబాబు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన అసలు పేరు జగపతిరావు అని తెలిపారు. అయితే సినిమా పరిశ్రమలో “రావు” అనే పదం ఎక్కువగా వినిపించడంతో, తాను తన పేరును జగపతిబాబుగా మార్చుకున్నట్లు చెప్పారు. అలాగే, "జగపతిబాబు" పేరు నోరుతిరగడానికి కొంచెం కష్టంగా ఉంటుందనిపించడంతో, అందరికీ సులభంగా గుర్తుండేలా జగ్గూభాయ్"గా మారిపోయానని ఆయన అన్నారు.

45

అంతఃపురం విశేషాలు

జగపతిబాబు నటించిన ఎన్నో సినిమాల్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే చిత్రం 'అంతఃపురం'. ఈ సినిమా గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. జగపతి బాబు మాట్లాడుతూ, తాను ఓ సమయంలో నిజంగానే చనిపోతున్నానని అనిపించిందని తెలిపారు. దర్శకుడు కృష్ణవంశీ అంతపురం సినిమాలో క్లైమాక్స్ షూట్ లో ఒక ఎమోషనల్ సీన్‌ చేస్తుండగా, ఆ సీన్ లో పూర్తిగా లీనమై, “కట్” అనకుండా చాలా సేపు కొనసాగించారని, దీంతో తానే నిజంగా చనిపోయానేమో అనుకున్నానని చెప్పారు. తన సినీ జీవితంలో ఈ సినిమాకి చెందిన క్లైమాక్స్ సీన్ తనకు ఎంతో ఇష్టమైనదని తెలిపారు.

55

జగపతి బాబు ఫిట్ నెస్ సీక్రేట్

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, "నాకు పెద్దగా కోరికలు లేవు. చివరి వరకు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే ఆశిస్తున్నాను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తున్న. వయస్సు పెరిగిన కారణంగా జుట్టు సహజంగా తెల్లగా మారింది, దానికి రంగు వేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అలాగే వదిలేశాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. అంతే కాని వయసైపోయిందన్న బాధ నాకు లేదు. ఉన్నంత వరకూ ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం అని జగపతి బాబు వెల్లడించారు. జగపతిబాబు చెప్పిన విషయాలు అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ఆయన వర్క్ స్టైల్, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుని రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్.

Read more Photos on
click me!

Recommended Stories