పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ `తొలి ప్రేమ` చిత్రంతో సంచలనంగా మారింది కీర్తి రెడ్డి. హీరోయిన్‌గా స్టార్ అయిపోయింది. ఒక్క మూవీతోనే టాలీవుడ్‌ని షేక్ చేసిన కీర్తి రెడ్డి తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించడం విశేషం. కానీ ఎక్కువగా ఆమె బెంగుళూరులో పెరిగింది. అక్కడే స్టడీస్ కంప్లీట్ చేసింది.
DID YOU KNOW ?
మహేష్ కి అక్కగా
కీర్తి రెడ్డి `తొలి ప్రేమ`లో పవన్ కళ్యాణ్‌కి లవర్‌గా నటించగా, `అర్జున్` సినిమాలో మహేష్ బాబుకి అక్కగా నటించడం విశేషం.
25
`తొలి ప్రేమ`తో కీర్తిరెడ్డి సంచలనం
1996లో గన్‌షాట్ చిత్రంతో కీర్తి రెడ్డి సినీ రంగ ప్రవేశం చేశారు. 1998లో పవన్ కళ్యాణ్ సరసన 'తోలి ప్రేమ'లో నటించారు. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ లవ్ స్టోరీస్‌లో ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తి రెడ్డి Tera Jadoo Chal Gayaa, Pyaar Ishq Aur Mohabbat చిత్రాలలో నటించారు.
35
కన్నడ అభిమానులకు దగ్గరైంది సుదీప్
నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన `సూపర్‌స్టార్` చిత్రంతో కీర్తి రెడ్డి కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కన్నడిగులు ఆమెను దేవయానిగా గుర్తిస్తారు. ఉపేంద్ర, కీర్తి రెడ్డి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే కీర్తి రెడ్డి, హీరో సుమంత్‌ను వివాహం చేసుకున్నారు. సుమంత్.. నాగార్జున మేనల్లుడు అనే విషయం తెలిసిందే. కొంత కాలం బాగానే ఉన్నా, ఆ తర్వాత సుమంత్ నుంచి విడిపోయింది కీర్తిరెడ్డి. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరి నుంచి విడిపోయిన తర్వాత కొంత గ్యాప్‌తో మరో ఎన్‌ఆర్‌ఐని పెళ్లిచేసుకుంది కీర్తి రెడ్డి. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. అక్కడ వీరికి వ్యాపారాలు, కంపెనీలున్నట్టు సమాచారం. ప్రస్తుతం తనభర్తతోపాటు తాను కూడా ఆ కంపెనీలు చూసుకుంటుంది కీర్తి. బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తుంది.
55
కీర్తి రెడ్డి తెలుగు సినిమాలివే.
కీర్తి రెడ్డి చివరిగా తెలుగులో మహేష్ బాబు `అర్జున్` సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాలు దూరమయ్యింది. మళ్లీ రీఎంట్రీ ఇస్తుందనే రూమర్స్ ఆ మధ్య వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలింది. ఇక తెలుగులో కీర్తిరెడ్డి, `గన్ షాట్`, `తొలి ప్రేమ`, `ప్రేమించే మనసు`, `రావోయి చందమామ` వంటి చిత్రాల్లో నటించింది.