
రమ్యకృష్ణ ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా రాణించింది. స్ట్రాంగ్ ఉమెన్‌రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచింది. కమర్షియల్ హీరోయిన్‌గా ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఎన్నో సినిమాలకు ఆమెని తీసుకుని ఆ తర్వాత తీసేసిన సందర్భాలున్నాయి. ఓ ఈవెంట్‌లోనే ఈ విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రమ్యకృష్ణ. అలాంటి పరిస్థితుల నుంచి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసింది, స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత క్యారెక్టర్స్ పరంగానూ తన హవా చూపించింది. `బాహుబలి`లో శివగామి పాత్ర ఆమె కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించింది. ఆమెకి మరో లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు.
అయితే యంగ్ ఏజ్‌లో రమ్యకృష్ణకి చాలా మంది ఇష్టపడేవారు. చాలా మంది అభిమానులకు ఆమె క్రష్‌గా ఉండేది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోలు కూడా లైనేసేవాళ్లట. క్యూలో ఉండేవారట. ఆమెని పడేసేందుకు చాలా ట్రై చేసిన వాళ్లు ఉన్నారట. అందులో జగపతిబాబు కూడా ఉండటం విశేషం. ఈ విషయాన్ని రమ్యకృష్ణనే స్వయంగా చెప్పడం మరో విశేషం. ఆ విషయాన్ని ఆయన ముందే, ఆయన షోలోనే నిర్మొహమాటంగా చెప్పేసింది రమ్యకృష్ణ. దెబ్బకి జగపతిబాబుకి నోట మాట లేదు. మరి ఇంతకి ఏం జరిగిందంటే. జగపతిబాబు హోస్ట్ గా జీ తెలుగులో `జయమ్ము నిశ్చయమ్మురా` షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి గెస్ట్ గా రమ్యకృష్ణ వచ్చింది. ఆమె రాకతో జగపతిబాబు చాలా స్టయిలీష్‌గా తయారయ్యారు. కుర్రాడిలా మారిపోయారు. టీషర్ట్ ధరించి యంగ్‌గా కనిపించారు. కనిపించడమే కాదు, అలానే ప్రవర్తిస్తూ రమ్యకృష్ణని ఇంప్రెస్ట్ చేసే ప్రయత్నం చేశారు.
ఇందులో రమ్యకృష్ణ ఎంట్రీతో జగపతిబాబు `నరసింహ` సినిమాలోనే పాటకి డాన్సులు చేశారు. అటు రమ్యకృష్ణ సైతం స్టెప్పులేసి జోష్ నింపింది. అనంతరం `రమ్యకృష్ణ వచ్చేసింది, వేడి పెరిగిపోయింద`ని జగపతిబాబు చెప్పడంతో ఆమె నవ్వుతూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అనంతరం `ప్రపంచంలో ఎవరైనా ఫోన్ చేస్తే హలో అంటారు, కానీ ఈమె మాత్రం `హే` అంటుంద`ని జగపతిబాబు చెప్పడం విశేషం. `రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి కారు కోసం వెయిట్ చేస్తే ఎవరు ఎక్కించుకోరు` అని జగపతిబాబు అనగా, `నువ్వు ఎంతో అందమైన, దయ హృదయం కలిగిన హీరోవి` అని, `అందరి హీరోయిన్ల విషయంలోనూ ఇలానే ఉంటావ`ని రమ్యకృష్ణ చెప్పడంతో జగ్గూభాయ్ ఆశ్చర్యపోయారు. కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత `నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం` అంటూ జగపతిబాబు కొనసాగిస్తుండగా, `ఇన్‌క్లూడింగ్ యూ(నువ్వు కూడా)` అంటూ మొహం మీదనే రమ్యకృష్ణ కౌంటర్ ఇవ్వడం విశేషం. `నిన్ను ఇబ్బంది పెట్టి, చిరాకు తెప్పించే మగాడు ఎవడైనా ఉన్నాడా` అంటూనే కింద పడి దొర్లుతూ, నానా రచ్చ చేశాడు జగపతిబాబు. ఇది చూసి తట్టుకోలేక ఆయనకు ఒక్కటిచ్చింది రమ్యకృష్ణ. మొత్తంగా రమ్యకృష్ణని చూసి జగపతిబాబు కుర్రాడిగా మారిపోయి రచ్చ చేయడం, తాజాగా విడుదలైన ప్రోమో రచ్చ రచ్చ చేయడం విశేషం.
జగపతిబాబు, రమ్యకృష్ణ కలిసి `ఆయనకు ఇద్దరు`, `బడ్జెట్ పద్మనాభం` వంటి చిత్రాల్లో నటించారు. అయితే వీరిద్దరు జంటగా నటించడం తక్కువే అని చెప్పొచ్చు. కానీ సినిమాలకు మించిన అనుబంధం వీరి మధ్య ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని బిజీగా ఉంటున్నారు. పాజిటివ్, నెగటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే రమ్యకృష్ణ పాజిటివ్, నెగటివ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇలా ఇద్దరూ బలమైన పాత్రలతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు.