టాప్ 10 ఇండియన్ హీరోల లిస్ట్ ను ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ జాబితాలో మళ్లీ నెంబర్ 1 ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారు. టాప్ 10 లో ఉన్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
ప్రస్తుతం సినిమాలు హీరోల స్టార్‌డమ్‌తోనే హిట్టయ్యే రోజులు కావివి. హీరోల బ్రాండ్ విలువ కన్నా కథకే ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో, ఒక మంచి సినిమా అయితే, స్టార్ వాల్యూ ఉన్నవారికి, లేనివారికి బాక్సాఫీస్ వసూళ్లలో తేడా ఉంటుంది. రీసెంట్ గా మలయాళంలో మోహన్‌లాల్ చిత్రాల వసూళ్లను ఉదాహరణగా చెప్పొచ్చు. ఆయన రీ-రిలీజ్ సినిమాలు కూడా ఇటీవల చాలా మంది అభిమానులను థియేటర్లకు రప్పించాయి. అదే సమయంలో, పెద్ద స్టార్ వాల్యూ లేకుండా విడుదలై సినిమాల్లో ఆల్-టైమ్ హిట్‌గా నిలిచిన చిత్రాలన్నీ కథకు ప్రాధాన్యతనిచ్చినవే.
25
ఫస్ట్ ప్లేస్ ప్రభాస్ దే
ఇక తాజాగా ఇండియన్ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన 10 మంది హీరోల జాబితా విడుదలైంది.ప్రతి నెలా విడుదలయ్యే ఈ జాబితాలో, గత నెలతో పోలిస్తే కొన్ని మార్పులతో కొత్త జాబితా వచ్చింది. ఆగస్టు జాబితాలో ఉన్న రజనీకాంత్, అక్షయ్ కుమార్ కొత్త జాబితాలో లేరు. వారి స్థానంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కొత్తగా చేరారు. మొదటి రెండు స్థానాలు గత నెల మాదిరిగానే ఉన్నాయి. ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా, విజయ్ దళపతి రెండో స్థానంలో ఉన్నారు. గత నెలలో మూడో స్థానంలో ఉన్న అజిత్ కుమార్, ఈసారి ఐదో స్థానానికి పడిపోయారు. ఆ మూడో స్థానాన్ని అల్లు అర్జున్ కైవసం చేసుకున్నారు.
35
టాప్ 10 లో ఆరుగురు తెలుగు హీరోలు
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో షారుఖ్ ఖాన్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆగస్టు జాబితాలో ఏడో స్థానంలో ఉన్న మహేష్ బాబు, కొత్త జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకారు. గత జాబితాలో ఐదో స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఈసారి ఏడో స్థానానికి పడిపోయారు. గత జాబితాలో లేని రామ్ చరణ్ ఈసారి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. గత జాబితాలో లేని పవన్ కళ్యాణ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. గత జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్, ఈసారి పదో స్థానానికి పడిపోయారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. సమంత మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. బాలీవుడ్ నటి అలియా భట్‌ను ఆమె మరోసారి వెనక్కి నెట్టింది. అలియా భట్ రెండో స్థానంలో నిలవగా, మరోన సౌత్ స్టార్ కాజల్ అగర్వాల్ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో కూడా దక్షిణ భారత నటి త్రిష నిలిచింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఐదో స్థానాన్ని దక్కించుకుంది. కోలీవుడ్ అగ్ర నటి నయనతార ఈసారి కూడా ఆరో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఏడో స్థానంలో 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఉంంది.
55
సాయి పల్లవి కూడా
ఆమె తర్వాత స్థానంలో సాయి పల్లవి ఉంది. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతోంది సాయి పల్లవి. స్టార్ హీరోయిన్ గా తన ప్లేస్ ను అలా కాపాడుకుంటోంది. చివరిగా సాయి పల్లవి నాగచైతన్య జోడీగా తండేల్ మూవీలో నటించింది. అంతకు ముందు 'అమరన్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ని కమల్ హాసన్ నిర్మించగా, శివకార్తికేయన్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూలు చేసింది.
నాగ చైతన్యకు జోడీగా నటించిన 'తండేల్' కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాయి పల్లవి తర్వాత స్థానాల్లో తమన్నా భాటియా, శ్రీలీల ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. ఇండియన్ టాప్ 10 హీరోయిన్స్ లో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ ఉండగా.. . మిగిలిన ఎనిమిది స్థానాలను దక్షిణ భారత హీరోయిన్లే ఆక్రమించారు.