Jacqueline Fernandez: బర్త్ డే గర్ల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. డ్యాన్స్ తో దుమ్ములేపిన టాప్ 7 సాంగ్స్ ఇవే

Published : Aug 11, 2026, 01:25 PM IST

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన 7 ఐకానిక్ డాన్స్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం. చిట్టియా కలైయా, లత్ లగ్ గయీ నుంచి పానీ పానీ, గెందా ఫూల్ వరకు అన్నీ సూపర్ హిట్టే.

PREV
18
చార్ట్‌బస్టర్ క్వీన్‌గా జాక్వెలిన్.. దుమ్మురేపిన 7 పాటలు
భారతీయ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె చిరునవ్వు, పాజిటివ్ ఎనర్జీ, గ్లోబల్ అప్పీల్‌తో అందరి మనసులు గెలుచుకుంటోంది. సినిమాల్లో అయినా, ఈవెంట్లలో అయినా, మ్యూజిక్ వీడియోల్లో అయినా.. జాక్వెలిన్ ఎప్పుడూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు ఇస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా, బ్లాక్‌బస్టర్ డాన్స్ నంబర్లకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆమె స్టైల్, గ్రేస్, మూవ్స్‌కు ఎవరూ సాటిరారని నిరూపించుకుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా, కెరీర్‌లోని 7 ఐకానిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లను చూద్దాం.
28
1. చిట్టియా కలైయా
జాక్వెలిన్ కెరీర్‌లోనే ఇది ఐకానిక్ సాంగ్. రిలీజైన వెంటనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఈజీ డాన్స్ మూవ్స్, ఎనర్జీ ఈ పాటను పెళ్లిళ్లు, పార్టీల్లో ఇప్పటికీ మారుమోగేలా చేశాయి.
38
2. లత్ లగ్ గయీ

'లత్ లగ్ గయీ' పాటలో జాక్వెలిన్ గ్లామర్, ఎలిగెన్స్‌ను అద్భుతంగా చూపించింది. ఆమె కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ కొరియోగ్రఫీ, అద్భుతమైన హావభావాలు ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలిపాయి. ప్రేక్షకుల ఫేవరెట్ సాంగ్స్‌లో ఇది కూడా ఒకటి.

48
3. లాల్ పరి

'లాల్ పరి' పాటలో జాక్వెలిన్ తన ఎలక్ట్రిఫైయింగ్ డాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను ఓన్ చేసుకుంది. ఈ హై-ఎనర్జీ ట్రాక్, పవర్‌ఫుల్ కొరియోగ్రఫీని ఆమె ఎంత ఈజీగా చేస్తుందో చూపించింది. దీంతో అభిమానులకు ఇది ఫేవరెట్ అయిపోయింది.

58
4. బెజోస్

'బెజోస్' పాట కోసం జాక్వెలిన్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ కార్ల్ వైన్‌తో చేతులు కలిపింది. ఇది ఇంటర్నేషనల్ బీట్స్‌ను ఆమె సిగ్నేచర్ స్టైల్‌తో మిక్స్ చేసిన క్రాస్-కల్చరల్ కొలాబరేషన్. తన కాన్ఫిడెన్స్, గ్లామర్‌తో ప్రతి ఫ్రేమ్‌లోనూ అదరగొట్టింది.

68
5. గెందా ఫూల్
'గెందా ఫూల్' పాటతో జాక్వెలిన్ తన కెరీర్‌లోనే ఒక మెమొరబుల్ మ్యూజిక్ వీడియో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్‌ను మోడ్రన్ స్టైల్‌తో కలిపి, తన గ్రేస్, కాన్ఫిడెన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకుంది. ఈ పాట చార్ట్‌లలో టాప్‌లో నిలిచింది.
78
6. పానీ పానీ
'పానీ పానీ' పాటతో జాక్వెలిన్ మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ చార్ట్‌బస్టర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఆమె స్టన్నింగ్ విజువల్స్, కాన్ఫిడెంట్ పెర్ఫార్మెన్స్, సిగ్నేచర్ డాన్స్ స్టైల్.. ఈ పాటను సోషల్ మీడియాలో మోస్ట్ వాచ్డ్ సాంగ్‌గా మార్చాయి.
88
7. యిమ్మీ యిమ్మీ
ఆర్టిస్ట్ టేక్‌తో కలిసి చేసిన 'యిమ్మీ యిమ్మీ' పాట జాక్వెలిన్ గ్లోబల్ అప్పీల్‌ను మరింత పెంచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఈజీ పెర్ఫార్మెన్స్ ఈ ట్రాక్‌ను దేశాల సరిహద్దులు దాటి హిట్ అయ్యేలా చేశాయి.
Read more Photos on
click me!

Recommended Stories