ఆ కారణంతోనే జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర కనిపించట్లేదు: కమెడియన్ వెంకీ

Published : Dec 25, 2025, 08:24 PM IST

Chammak Chandra: జబర్దస్త్ వెంకీ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కున్న కష్టాలు, డిప్రెషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను సొంతంగా స్క్రిప్ట్‌లు రాసుకుని, తన టీం సభ్యులను ప్రోత్సహించి ఇలా నిలబడ్డామని పేర్కొన్నాడు. అలాగే చమ్మక్ చంద్రపై కూడా కామెంట్స్ చేశాడు. 

PREV
15
కమెడియన్ వెంకీ కీలక కామెంట్స్..

వెంకీ మంకీ అనే టీంతో జబర్దస్త్‌లో తనకంటూ ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ వెంకీ. ఇటీవల అతడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జబర్దస్త్ ప్రయాణం, ఎదురైన సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ఆరంభంలో స్నేహితుల ముందు పరువు పోయిందని భావించి డిప్రెషన్‌లోకి వెళ్ళినట్లు తెలిపాడు. ఆ సమయంలో నితిన్ అన్న, భరత్ అన్న నుంచి 'ఇది నీ చివరి షెడ్యూల్' అని పిలుపు రావడంతో, అవకాశాలు కోల్పోయానని తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే టీమ్ నుంచి పిలుపు రావడంతో మైసమ్మ ఆశీస్సులతో స్వయంగా స్క్రిప్ట్‌లు రాయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు.

25
రెండు లైన్ల కామెడీతో తన ప్రయాణం

సినిమాల నుంచి స్ఫూర్తి పొంది, ముఖ్యంగా రెండు లైన్ల కామెడీతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టానని తెలిపాడు. నితిన్ అన్న, భరత్ అన్నకు తన ఆలోచనను పర్ఫార్మెన్స్‌తో చూపించగా, వారు తనను ప్రోత్సహించానని చెప్పుకొచ్చాడు. తన స్కిట్ విషయంలో మొదట నాగబాబు సందేహించినా.. ఆ తర్వాత పడిపడి నవ్వడం తనకెంతో ఎనర్జీ ఇచ్చిందని వెంకీ పేర్కొన్నాడు.

35
కన్ఫ్యూషన్ డ్రామా తన ట్రేడ్‌మార్క్‌..

గిఫ్ట్ ఎపిసోడ్ తన జీవితాన్ని, రాతను మార్చిందని వెంకీ గుర్తుచేసుకున్నాడు. తన ఇంట్లో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా, టీ గురించి చేసిన ఈ స్కిట్ విజయం సాధించిందన్నాడు. అప్పటినుంచి కన్ఫ్యూషన్ డ్రామా తన ట్రేడ్‌మార్క్‌గా మారింది. రైటర్స్‌పై ఆధారపడకుండా సొంతంగా స్క్రిప్ట్‌లు రాసుకోవడం తన విజయానికి కారణం అయిందన్నాడు.

45
టీం మెంబర్స్‌కు ప్రాధాన్యం

జీవన్, పంచు ప్రసాద్, ఇమ్మానుయేల్, తాగుబోతు రమేష్ లాంటి తన సహ నటులందరినీ సమానంగా చూసుకుంటూ, వారి పాత్రలు కీలకంగా ఉండేలా చూసుకుంటూ టీమ్‌ను నిలబెట్టానని కమెడియన్ వెంకీ తెలిపాడు. ఇతరులు తమకు మాత్రమే క్యారెక్టర్లు రాయించుకోవడానికి ఇష్టపడినా, తాను తన టీమ్ సభ్యులు నిలబడాలనే ఆలోచించానని, వారికోసం కూడా క్యారెక్టర్లు రాశానని చెప్పాడు.

55
చంద్రపై ఆసక్తికర వ్యాఖ్యలు..

అటు చమ్మక్ చంద్ర గురించిన ఆసక్తికర విషయాన్ని వెంకీ పంచుకున్నాడు. చమ్మక్ చంద్ర త్వరలో మూడు సినిమాల్లో హీరోగా రానున్నాడు. తనతో సహా చాలామంది కమెడియన్లు సినిమాల్లో చిన్న పాత్రలకే పరిమితమవుతున్నారని, అయినా తన టీమ్ సభ్యులను, తన కళను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నానని వెంకీ స్పష్టం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories