మూడో స్థానంలో బిగ్ బాస్ ఫినాలే నుంచి బయటకు వచ్చిన డీమాన్ పవన్
బిగ్ బాస్ తెలుగు 9వ షో విజయవంతంగా ముగిసింది. ఆదివారంతో ఈ షో క్లోజ్ అయిన విషయం తెలిసిందే. కామన్ మేన్ కేటగిరిలో హౌజ్‌లోకి వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచాడు. తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లని దాటుకొని ఆయన దూసుకుపోయాడు. విన్నర్‌గా నిలిచాడు. ఇక మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ మూడో స్థానంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
24
డీమాన్ పవన్ జాక్ పాట్
డీమాన్ పవన్ కూడా కామన్ మేన్ కేటగిరిలోనే హౌజ్‌లోకి వచ్చాడు. నెమ్మదిగా పుంజుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. కామనర్స్ గా వచ్చిన శ్రీజ, ప్రియా, మర్యాద మనీష్, హరిత హరీష్, దివ్య వంటి వారు ప్రారంభంలోనే వెళ్లిపోగా, కళ్యాణ్‌తోపాటు డీమాన్ పవన్ మాత్రమే ఫైనల్ వరకు ఉన్నాడు. మూడో స్థానంలో వైదొలిగాడు. అయితే 15 లక్షల సూట్‌కేసుని తీసుకుని ఆయన ఫైనల్ పోటీ నుంచి తప్పుకోవడం విశేషం. దీంతో ఆల్మోస్ట్ విన్నర్ రేంజ్ ప్రైజ్ మనీతో, సెలబ్రిటీ కంటెస్టెంట్ల రేంజ్‌లో పారితోషికం దక్కించుకోవడం విశేషం.
34
రీతూతో డీమాన్ పవన్ లవ్ ట్రాక్
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌లో డీమాన్ పవన్ ఎక్కువగా రీతూ చౌదరీతోనే ఉన్నాడు. ఆయన రెండు మూడు వారాల నుంచే ఆమెకి క్లోజ్ అయ్యాడు. ఇద్దరు ప్రేమలో ఉన్నారనేంతగా హౌజ్‌లో మెలిగారు, అంతే బాగా మెప్పించారు. తమ మధ్య కెమిస్ట్రీని పండించారు. అయితే రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత డీమాన్ పవన్ యాక్టివ్‌గా కనిపించాడు. బాగా ఓపెన్ అయ్యాడు. ఎంటర్‌టైన్ చేయడంలోనూ, గేమ్స్ పరంగానూ అదరగొట్టారు. ముందు నుంచి ఇలానే ఉంటే వేరే స్థాయిలో ఉండేవాడని అంతా అనుకున్నారు. హౌజ్‌లోనే కాదు, బయట కూడా అదే టాక్ వినిపించింది. అయితే తాజాగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురయ్యింది.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నుంచి బయటకు వచ్చాక శివాజీతో టాక్ షోలో మాట్లాడాడు. ఇందులో హౌజ్లోకి వెళ్లాక లవ్ ట్రాక్ కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేస్తాను అని శ్రీజతో డీమాన్ పవన్ చెప్పాడట. ఆమె శివాజీతో చెప్పిందట. అదే విషయాన్ని ప్రశ్నించాడు శివాజీ. అలాంటిది నిజం కాదని, ఆర్గానిక్‌గా జరిగిందన్నాడు పవన్. అయితే ఆర్గానిక్ అనుకున్నాం, కానీ హైబ్రీడ్ అని తర్వాత తెలిసిందని శివాజీ అడగడంతో, డీమాన్ పవన్ నోరెళ్లబెట్టాడు. బయట ఎలా ఉంటానో, లోపల అలా ఉన్నాను అని చెప్పాడు పవన్. కానీ అందరు ఇదే చెబుతున్నారని శివాజీ చెప్పడంతో మళ్లీ షాక్ అయ్యాడు పవన్. దీని బట్టి చూస్తే డీమాన్ పవన్ లవ్ ట్రాక్ వర్కౌట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకునే వెళ్లాడని అర్థమవుతుంది. అయితే ఓ దశలో ఆయనకు ఆ ట్రాకే మైనస్ మారింది. చివరి వారాల్లో ఉన్నట్టుగా ముందు నుంచి ఉంటే, టైటిల్ రేసులో డీమాన్ పవన్ ఉండేవాడనే టాక్ వినిపించింది. ఏదేమైనా టాప్ 3లో 15 లక్షల సూట్ కేసుతో బయటకు రావడం విశేషం.