ఒక ఫ్లాప్ తో, పవన్ కళ్యాణ్ పై ఆశతో ఈ ఏడాదికి ముగింపు పలుకుతున్న హీరోయిన్.. క్రేజీ ఫోటోస్ వైరల్

Published : Dec 25, 2025, 07:24 PM IST

వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోయిన్ తాజాగా పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఈ ఏడాది మీనింగ్ ఫుల్ గా ముగిసింది అని కామెంట్ చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
పవన్ కళ్యాణ్ నుంచి 2 సినిమాలు

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా హిస్టారికల్ పీరియడ్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఓజీ చిత్రం మాత్రం సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రజెంట్ చేసిన విధానానికి అభిమానులు ఫిదా అయ్యారు.

25
వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్

ఓజీ చిత్రం చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల దాహం తీర్చింది అనే చెప్పాలి. చాలా కాలంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్న పవన్ చిత్రం మరొకటి ఉంది. అదే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే.

35
రాశి ఖన్నా కామెంట్స్ 

ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో రాశి ఖన్నా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ పూర్తి కావడంతో ఈ ఏడాదిని అర్థవంతంగా ముగిస్తున్నా. ఈ ముగింపు సరికొత్త ప్రారంభానికి నాంది' అని పోస్ట్ చేసింది. 

45
పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆశలు 

చూస్తుంటే రాశి ఖన్నా ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా శ్లోక అనే పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది రాశి ఖన్నా తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో మాత్రమే నటించింది. అది కూడా ఫ్లాప్. ఇటీవల కాలంలో తెలుగులో ఆమెకి సరైన హిట్ లేదు. అంతకు ముందు నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. 

55
ఫోటోస్ వైరల్ 

ఉస్తాద్ భగత్ సింగ్ తో అయినా తనకి హిట్ దక్కుతుందేమో అనే నమ్మకంతో రాశి ఖన్నా ఉంది.  ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లొకేషన్ ఫొటోస్, పవన్ తో నటిస్తున్న సన్నివేశాల ఫోటోలని రాశి ఖన్నా అభిమానులతో పంచుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories