Jabardasth : ఈగో వల్ల జబర్దస్త్‌ ను వదిలి వెళ్లిపోయిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?

Published : Dec 26, 2025, 02:31 PM IST

జబర్దస్త్‌ ఎంతో మంది కమెడియన్స్ కు మంచి లైఫ్ ను ఇచ్చింది. మారుమూలన ఉన్నవారిని కూడా సెలబ్రిటీలను చేసింది. అటువంటి జబర్దస్త్‌ లో ఈగో ఇష్యూ వల్ల వదిలి వెళ్లిన కమెడియన్ ఎవరో తెలుసా?

PREV
17
టెలివిజన్‌ చరిత్రలో సంచలనం..

తెలుగు టెలివిజన్‌లో చరిత్రలో సంచలనం సృష్టించిన కామెడీ షోగా జబర్దస్త్‌ నిలిచింది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ.. దాదాపు 15 ఏళ్లకు పైగా ఈ షోను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఈ షో వల్ల మారుమూలన పల్లెల్లో ఉన్న కామెడీ నటులు కూడా స్టార్స్ గా ఎదిగారు. సినిమాల్లో అవకాశాలు సాధింది.. కోట్లు సంపాదించారు. హైపర్ ఆది, చమ్మకు చంద్ర, సుడిగాలి సుదీర్ , రంగస్థలం మహేష్, చంటీ, రాఘవ లాంటివారు ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ లుగా ఉన్నారు. వారంత జబర్దస్త్ వల్లే ఈ స్థాయిలో స్టార్ డమ్ ను సాధించారు. ప్రస్తుతం చాలామంది సీనియర్లు జబర్థస్త్ ను వదిలేసి.. సినిమాల్లో బిజీ అయిపోయారు.

27
జబర్దస్త్‌ ను వదిలేసిన స్టార్ కమెడియన్స్..

ఇప్పటికే జబర్దస్త్‌ నుంచి ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే పలువురు సీనియర్ కమెడియన్లు ఈ షో నుంచి తప్పుకోగా, జబర్దస్త్ లోకి కొత్త నీరు వస్తూనే ఉంది. మరికొంత మంది సీనియర్ కమెడియన్లు మాత్రం.. జబర్దస్త్‌ ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. అయితే ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వెంకీ కూడా షోను వదిలేసిన విషయం తెలిసిందే. మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో జబర్దస్త్‌లో మంచి గుర్తింపు సాధించాడు వెంకీ.... సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు వెంకీ. వెంకీ మంకీ టీమ్‌తో టీమ్ లీడర్‌గా మారి అనేక స్కిట్స్‌ ను లీడ్ చేశాడు. సడెన్ జబర్దస్త్‌ ను వదిలి వెంకీ ఎందుకు వెళ్లాడంటే?

37
జబర్దస్త్‌ ను వదిలేసిన స్టార్ కమెడియన్స్..

ఇప్పటికే జబర్దస్త్‌ నుంచి ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే పలువురు సీనియర్ కమెడియన్లు ఈ షో నుంచి తప్పుకోగా, జబర్దస్త్ లోకి కొత్త నీరు వస్తూనే ఉంది. మరికొంత మంది సీనియర్ కమెడియన్లు మాత్రం.. జబర్దస్త్‌ ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. అయితే ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వెంకీ కూడా షోను వదిలేసిన విషయం తెలిసిందే. మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో జబర్దస్త్‌లో మంచి గుర్తింపు సాధించాడు వెంకీ.... సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు వెంకీ. వెంకీ మంకీ టీమ్‌తో టీమ్ లీడర్‌గా మారి అనేక స్కిట్స్‌ ను లీడ్ చేశాడు. సడెన్ జబర్దస్త్‌ ను వదిలి వెంకీ ఎందుకు వెళ్లాడంటే?

47
వెంకీ జబర్దస్త్‌ ను వీడటానికి కారణం ఏంటి?

జబర్దస్త్‌ ను వెంకీ ఎందుకు వదిలేశాడు అనే విషయంలో ఎప్పటి నుంచో ఆడియన్స్ లో సందేహాలు ఉన్నాయి. ఈక్రమంలో అతను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను షోను ఎందుకు వదిలేశాడో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంకీ మాట్లాడుతూ..'' గత ఆరు నెలల నుంచే తాను జబర్దస్త్ మానేశాను .. దాదాపు పదేళ్ల పాటు టీమ్ లీడర్‌గా పనిచేశా.. ఎన్నో స్కిట్స్ గెలిచా.. అయినప్పటికీ నేను ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు..'' అని వెంకీ అన్నాడు.

57
ఈగోతోనే జబర్దస్త్‌ను మానేశాను...

వెంకీ మాట్లాడుతూ.. ''నేను ఈగోతోనే జబర్దస్త్‌ను వదిలేశాను.. నేను తాగుబోతు రమేష్ అన్న కలిసి మంచి టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాం, అనేక స్కిట్స్ గెలిచాము.. మంచి టీమ్ గా మాకు గుర్తింపు కూడా ఉంది. కానీ ఒకసారి ఎలాంటి కారణం చెప్పకుండా ఒక షెడ్యూల్ ఆగాలని, స్కిట్ చేయొద్దని డైరెక్షన్ టీమ్ చెప్పారు. స్కిట్ కోసం అన్నీ రెడీ చేసుకున్న టైమ్ లో ఇలా చెప్పారు. ఎందుకు అని అడిగితే కొన్ని మార్పులు జరుగుతున్నాయని, మూడు షెడ్యూల్స్ తర్వాత చూస్తామని చెప్పారని'' వెంకీ వెల్లడించాడు.

67
వెంకీని అవమానించిన జబర్దస్త్‌ టీమ్..

దాదాపు మూడు వారాలు నన్ను టీమ్ లోకి రానివ్వలేదు.. కాల్ ఎప్పుడోస్తుందా అని ఎదురుచూశాను.. అయినా నన్ను పిలవలేదు. , మరో రెండు వారాలు కూడా కాల్ రాలేదు.. ఐదు వారాల తర్వాత డైరెక్షన్ టీమ్ నుంచి నాకు కాల్ వచ్చింది. నెక్ట్స్ షెడ్యుల్ లో స్కిట్ చేసుకోమన్నారు. కానీ నాకు నచ్చలేదు. నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. అందుకే నేను జబర్దస్త్‌ను మానేశాను. అప్పటి నుంచే పూర్తిగా వెళ్లలేదు. జబర్దస్త్ మీటింగ్‌లలో టీమ్ వైజ్ రేటింగ్స్ తీస్తారు.. ఆ రేటింగ్స్ లో మా టీమ్ టాప్ 3లో ఉన్నా కూడా నెక్స్ట్ డేనే మా టీమ్‌ను ఆపేశారు. అది ఎంత వరకూ కరెక్ట్.. అది నాకు నచ్చలేదు" అని వెంకీ ఆరోపించాడు.

77
మేము చాలా హర్ట్ అయ్యాము..

ప్రేక్షకులు చూస్తున్నా, రేటింగ్స్ వచ్చినా తమను పక్కన పెట్టారని, ఆ విషయమే తనకు, తాగుబోతు రమేష్‌కు చాలా హర్ట్ అనిపించిందని వెంకీ చెప్పారు. అక్కడ అందరినీ టెస్ట్ చేస్తారని, తమను ఒక ఆప్షన్‌లా చూశారని, అది తమకు నచ్చలేదని పేర్కొన్నారు. జబర్దస్త్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, అదే తనకు జీవనాధారం ఇచ్చిందని ఒప్పుకున్న వెంకీ, అక్కడ ఉన్న కొంతమంది కారణంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అన్నారు.కొత్తవాళ్లు వస్తున్న కారణంగా పాతవాళ్లను పక్కన పెడుతున్నారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. మనసు చంపుకుని మాత్రం జబర్దస్త్‌కు తిరిగి వెళ్లనని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories