Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌

Published : Dec 16, 2025, 07:38 AM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌ లర్‌గా ఉంది. పెళ్లి గురించి ఆమె ఎప్పుడూ దాటవేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మ్యారేజ్‌కి రెడీ అయ్యింది. 

PREV
14
లవ్ ట్రాక్‌తో రష్మి, సుధీర్‌ లకు క్రేజ్‌

జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్‌ అయిన రష్మి గౌతమ్‌ ప్రస్తుతం `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో ఆమెకి విశేషమైన గుర్తింపుని, ఫాలోయింగ్‌ని తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో రష్మికి ఉన్న క్రేజ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. అయితే దీనికి మరో కారణం కూడా ఉంది. ఆమె సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపించడమే. `జబర్దస్త్` షోలో సుధీర్‌, రష్మి కలిసి చేసిన స్కిట్లు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా లవ్‌ స్కిట్లు, డ్యూయెట్‌ స్కిట్లు విశేషంగా ఆదరణ పొందాయి. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచాయి.

24
దూరమైన సుధీర్‌, రష్మి జంట

దీంతో సుధీర్‌, రష్మి నిజంగానే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అభిమానులు కూడా అదే భావించారు. కానీ అనూహ్యంగా రెండేళ్ల నుంచి వీరిద్దరు దూరమయ్యారు. సుధీర్‌.. జబర్దస్త్ షోని వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రష్మి, సుధీర్‌ మధ్య గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలవలేదు. అయితే చాలా అరుదుగానే ఈ ఇద్దరు కలుస్తూ తమ రిలేషన్‌ని చాటి చెబుతున్నారు.

34
పెళ్లి రష్మి పెళ్లి వార్త

ఇదిలా ఉంటే నలభై ఏళ్లకి దగ్గరగా ఉన్నా రష్మి గౌతమ్‌ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు. ఈ క్రమంలో క్లారిటీ వచ్చింది. పెళ్లికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. టైమ్‌ కూడా ఫిక్స్ అయ్యిందట. తాజాగా ఆస్ట్రాలజర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్మి గౌతమ్‌ వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని, ఆమె జీవితంలో పెళ్లి యోగం ఉందని తెలిపారు. మనసులో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుందని తెలిపాడు. రష్మి జీవితంలోకి పెళ్లి గాలి సోకిందని, ఆ గాలి బలంగా వీస్తుందని తెలిపారు.

44
రష్మి మనసులో ఉన్నదెవరు?

మరి ఆ గాలి సుడిగాలినా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి రష్మి కూడా స్పందించింది. ఆస్ట్రాలజర్‌ చెప్పినదాంట్లో చాలా వరకు నిజం ఉందని తెలిపింది. రష్మి కూడా నిజమే అని చెప్పిందంటే వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని చెప్పొచ్చు. ఆమె చేసుకోబోయేది సుధీర్‌ నా? లేక మరో వ్యక్తిని ప్రేమిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఒక ఆస్ట్రాలజర్‌ పాల్గొన్నాడు. ఇందులోనే యాంకర్‌ రష్మి గౌతమ్‌ జాతకం చెప్పాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories