
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఎండ్ కార్డు పడే టైమ్ దగ్గరకు వచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉండగా.. ఫినాలే కోసం ఓటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగు గ్రాండ్ ఫినాలేకు ఇంకా వారంలోఉండటంతో.. విన్నర్ ఎవరో చూడాలని ఆడియన్స్ లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఎవరి ఫేవరేట్ కంటెస్టెంట్ కు వారు ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు ఇద్దరు కంటెస్టెంట్ మధ్య మాత్రమే హోరా హోరి పోరు కొనసాగింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎక్కవ ఓట్లు ఎవరికి పడుతున్నాయి. టాప్ లో ఎవరు ఉన్నారు. టాప్ 3 ల ఉన్నది ఎవరు. రాబోయే రోజుల్లో ఓటింగ్ మారే అవకాశం ఉందా?
లాస్ట్ వీక్ జరిగిన ఎలిమినేషన్‌లో అనూహ్యంగా భరణి హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత, తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, సంజన టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. గత వారం వరకు ఇంటి నుంచి సంజన బయటకు వెళ్తుందని అందరు అనుకున్నారు. భరణికి కూడా బాగానే ఓటింగ్ నమోదు అయ్యింది. కానీ ఆ వారంలో సంజనను కంటెస్టెంట్లు ఎక్కువగా టార్గెట్ చేసి.. ఏదో ఒకటి అనడం.. నెగెటీవ్ గా చెప్పాలంటే ఆమె గురించి మాత్రమే చెప్పడంతో.. సంజనా ఓటింగ్ పెరిగింది. హౌస్ లో ఉన్నవారి వల్ల ఆమెకు అన్యాయం జరుగుతోందని ఫ్యామిలీ ఆడియన్స్ భావించారు. దాంతో సంజనకు మద్దతు పెరిగి, ఆమె టాప్ 5లో స్థానం సంపాదించుకుంది. భరణి ఓటింగ్ తగ్గడంతో ఆడియన్స్ కు ఇష్టం లేకపోయినా.. తక్కువ ఓటింగ్ కారణంగానే ఆయన బయటకు వెళ్లినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, నుంచి బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కోసం అధికారిక ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ స్థాయిలో ఓట్లు పోలు అవుతున్నాయి. ఓటింగ్ ప్రకారం మొదటి రోజు కొంత సమయం వరకూ తనూజకు ఎక్కువ ఓట్లు పడి ముందుండగా.. కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో కొనసాగాడు.. కానీ సాయంత్రం కల్లా పరిస్థితి మారిపోయింది. తనూజకు షాక్ ఇస్తూ.. కళ్యాణ్ ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. 45 శాతం ఓటింగ్ తో కళ్యాణ్ పడాల దూసుకుపోతుండగా... తనూజ 28 శాంతం ఓట్లతో కొనసాగుతోంది. మిగిలినవారిలో ఇమ్ము 12 శాతం , పవన్ 9 శాతం, సంజన 7 శాతం ఓటింగ్ తో ఉన్నట్టు కొన్ని సోషల్ మీడియా సంస్థలలో నమోదు అయ్యింది. ఇప్పటి వరకూ రేసులో కళ్యాణ్, తనూజ ముందంజలో ఉన్నారు. వారిద్దరి మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ నాలుగు రోజుల్లో ఏదైనా చిత్రం జరిగి ఎవరైనా టాప్ లోకి వస్తారేమో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదివారాలు ముగిసే సరికి.. విన్నర్ పై చాలామంది ఓ క్లారిటీకి వచ్చారు. పక్కాగా ఈసారి టైటిల్ కప్పు గెలిచుకుని వెళ్లేది పవన్ కళ్యాన్ అని ఎక్కువ మంది అంటున్నారు. పవన్ తరువాత తనూజకు కూడా ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు బయట ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు ఇమ్మానయేల్ కు కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక చాలామంది అభిప్రాయపడుతున్నట్టుగా కళ్యాణ్ టైటిల్ విన్నర్ అయితే. తనూజకు కానీ, ఇమ్ముకు కానీ రన్నర్ కప్ లభించే అవకాశం ఉంది. కానీ రన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా తనూజకే ఉన్నట్టు సమాచారం.
మూడవ స్థానానికి గట్టి పోటీ కొనసాగుతోంది. ఇమ్మానుయేల్, డిమోన్ పవన్‌లలో ఎవరో ఒకరు ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశముందని సమాచారం. అయితే ఇప్పటి వరకూ చూస్తే... ఇమ్ముకే ఆ అవకాశం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం డిమోన్ పవన్‌కు వేరే స్థాయి ఓటింగ్ వస్తున్నట్టు సమాచారం. గత వారం డిమోన్ పవన్, ఇమ్మానుయేల్ కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అందించాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందువల్ల అతనికి ఓట్లు పెద్ద ఎత్తున పడుతున్నాయని చెబుతున్నారు. నాల్గవ స్థానంలో ప్రస్తుతం ఇమ్మానుయేల్ కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే డిమోన్ పవన్ కు అదే ఓటింగ్ కొనసాగకపోవచ్చు.. పవన్, ఇమ్మానుయేల్ మధ్య ఓటింగ్ తేడా పెద్దగా లేకపోవడంతో, ఈ వారం ఎవరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తారన్నదానిపై మూడవ స్థానం ఆధారపడి ఉంటుంది.
ఇక చివరి స్థానంలో సంజన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 11వ వారం ఆమెకు గేమ్ ఛేంజింగ్ మూమెంట్‌గా మారిందని చెబుతున్నారు. రీతూ చౌదరిపై చేసిన బోల్డ్ కామెంట్స్, నాగార్జున తప్పు అని చెప్పినా ఒప్పుకోకపోవడం, బయటకు వెళ్లమంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉండటం వంటివి ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు.. ఆమె గ్రాఫ్ కూడా అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, టాప్ 5 వరకు చేరుకుంది. ప్రస్తుతం టాప్ 5లో ఉన్న ఈ క్రమం రాబోయే రోజుల్లో ఆమెకు ఓటింగ్ శాతం పెరిగితే.. టాప్ 3 లోకి వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు.