Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ

Published : Dec 16, 2025, 12:03 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో ఈ వారంలో పూర్తవుతుంది. ఈ క్రమంలో టాప్‌ 5 కంటెస్టెంట్లు తమ ఈ బిగ్‌ బాస్‌ జర్నీని పంచుకున్నారు. చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఈ క్రమంలో తనూజకి డీమాన్‌ పవన్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు.  

PREV
17
గ్రాండ్‌ ఫినాలే వీక్‌ స్టార్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ విజయవంతంగా పూర్తి కాబోతుంది. షో చివరికి చేరుకుంది. ఈ వారంతోనే క్లోజ్‌ కాబోతుంది. గ్రాండ్‌ ఫినాలే వీక్‌కి చేరుకుంది. వచ్చే ఆదివారం విన్నర్‌ ఎవరో తేలబోతుంది. గత వారం భరణి, సుమన్‌ శెట్టి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరు ఫైనల్‌కి వెళ్లారు. కప్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎపిసోడ్‌లో ఈ టాప్ 5 కంటెస్టెంట్లు బిగ్‌ బాస్‌ జర్నీని పంచుకోవాలని తెలిపారు. దీంతో ఎవరికి వారు తమ అనుభవాలను పంచుకున్నారు. చాలా వరకు అంతా ఎమోషనల్‌ అయ్యారు.

27
నవ్విస్తానా? అనే భయం స్టార్ట్ అయ్యింది

మొదటగా ఇమ్మాన్యుయెల్‌ చెబుతూ, ఈ షో నుంచి కాల్ రావడానికి ముందు మరో షోలో టీమ్‌ టీడర్‌గా ఉన్నారు. మంచి స్థానంలో ఉన్నా. ఈ ఆఫర్‌ వచ్చినప్పుడు వెళ్లాలా? వద్దా అనే డైలామాలో పడ్డాను. ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ ఉండేది. చాలా రోజులు ఆలోచించాను. అన్ని పాజిటివ్ గా ఉంటాయా అనే ఆలోచనలతో, తాను ఎందులోకి వెళ్లినా సక్సెస్‌ అవుతాననే నమ్మకంతో ఎట్టకేలకు రావాలని నిర్ణయించుకున్నాను. తాను ఏం చేసినా సక్సెస్ అవుతూ వస్తున్నాను. ఇందులోనే అదే నమ్మకంతో వచ్చాను. నవ్వించడం ఈజీనే కదా అనుకుని వచ్చా.. కానీ వచ్చాక చాలా టఫ్‌ అనిపించింది. మొదటి వారంలోనే హరీష్‌ తో గొడవ. వామ్మో తాను నవ్వించగలనా అనే డౌట్‌ వచ్చింది. ఆయనతో గొడవతో ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట కూలిపోయిందా అనే సందేహం కలిగింది. ఇంత మందిని ఎలా నవ్వించాలని ప్రారంభంలో నిద్రపట్టేది కాదు. ఆ టైమ్‌లోనే అమ్మ(సంజనా) దొరికింది. నాలో ధైర్యాన్ని నింపింది. ఇన్ని వారాలు ఉంటానని అనుకోలేదు. ఇప్పటి వరకు నా లైఫ్‌ ఒక లెక్క, ఇక ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో తర్వాత మరో లెక్క` అని తెలిపారు ఇమ్మాన్యుయెల్‌.

37
నాపై నిందని తుడిపేయాలని వచ్చా

సంజనా చెబుతూ, తాను రెండు మూడు వారాలు ఉంటేనే ఎక్కువ అనుకుని, జోకులు వేసుకుని ఒచ్చాను. కానీ ఇప్పుడు టాప్‌ 5లో ఉండటం విశేషం. తనపై నింద ఉన్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేసి రెస్పెక్ట్ తో బయటకు వెళ్లాలనుకుంటున్నా. నాకు ఇమ్మాన్యుయెల్‌ లాంటి కొడుకు దక్కినందుకు ఆనందంగా ఉంది అని చెప్పింది.

47
కన్నీళ్లు పెట్టుకున్న పవన్‌

పవన్‌ చెబుతూ, నాన్నకి క్యాన్సర్‌. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌ బాస్‌ షోకి వచ్చాను. తాను స్పోర్ట్స్ వైపు వెళ్లాలనుకున్నా, కానీ ఇంట్లో వద్దన్నారు. ఆ తర్వాత కొన్ని సినిమా, సీరియల్స్ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత తీసేశారు. ఇలా చాలా స్ట్రగుల్‌ అయ్యాను. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిసి ఆనందపడ్డాను. అయితే టీనేజ్‌లో చాలా స్ట్రగుల్‌ అయ్యాను, మనీ కోసం పేరెంట్స్ మీద, అన్నల మీద ఆధారపడే వాడిని. అవి చూస్తే నాకే బాధగా అనిపించేవి. దాన్నుంచి ఎలాగైనా బయటపడాలని చిన్న చిన్న జాబ్‌లు కూడా చేసేవాడిని, ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోలో ఛాన్స్ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను` అని తెలిపాడు. 

57
బిగ్‌ బాస్‌ మనం కావాలని తెచ్చుకున్న కష్టం

కళ్యాణ్‌ చెబుతూ, బిగ్‌ బాస్‌ షో కావాలని తెచ్చుకున్న కష్టం. ఇందులో ఫుడ్‌ సరిగా ఉండదు, మనుషులు సరిగా ఉండరు. అన్నింటికి ఇబ్బంది. కానీ మనకు ఇదే కావాలి. ఈ షో నాకు మంచి అన్నని ఇచ్చింది. అలాగే తనూజ లాంటి ఫ్రెండ్‌ని ఇచ్చింది. ఆమెతో స్నేహం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నా అని చెప్పాడు.

67
ఇకపై ఎవరినీ లెక్కచేయను

తనూజ మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావడం నాన్నకి ఇష్టం లేదు. నిందలు మోసే పనులు వద్దు అని చెప్పవాడు. కానీ తాను సినిమాల్లోకి వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఎంతో ఆదరించి ఈస్థాయికి తీసుకొచ్చింది. ఈ షో చాలా నేర్పించింది. ఇకపై నేను ఎవరినీ లెక్కచేయను. ఎవరి గురించి పట్టించుకోను, నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను. అదే సమయంలో ఈ షోకి రావడం వల్ల ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలనేది తెలుసుకున్నాను` అని తెలిపింది తనూజ.

77
పవన్‌ పై తనూజ ఫైర్‌

ఇక హౌజ్‌లో పలు టాస్క్ లు ఇచ్చాడు బిగ్‌ బాస్‌. అందులో పవన్‌ గెలిచాడు. ఆయన కోరిన ట్రీట్‌ వచ్చింది. అయితే కిచెన్‌లో అందరు సరదాగా చర్చించుకున్నారు. పవన్‌ని ఉద్దేశించి తనూజ మాట్లాడుతూ, కంటెంట్‌ కోసం ఇవన్నీ చేస్తుంటాను, కానీ అవి వర్కౌట్‌ కావు అని చెప్పింది. దీనికి పవన్‌ స్పందిస్తూ, కంటెంట్‌ కోసమే అయితే మొదట్నుంచి నేను నీవెంటనే పడేవాడిని అని తెలిపాడు. తనూజతో జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో శ్రీజ కూడా ఇదే విషయం చెప్పింది` అని తెలిపారు పవన్‌. దీంతో పవన్‌పై సీరియస్‌ అయ్యింది తనూజ. కాసేపు హౌజ్‌ హీటెక్కింది. ఆ తర్వాత కూల్‌ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories