హిట్టు మీద హిట్టు, 65 ఏళ్ల వయసులో రెమ్యునరేషన్ భారీగా పెంచిన వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎంతంటే?

Published : Jan 27, 2026, 04:36 PM IST

65 ఏళ్ల వయసులో హిట్లు మీద హిట్టు కొడుతున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్. మెగాస్టార్ తో కలిసి ఈసంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రచ్చ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న ఈ సీనియర్ హీరో.. రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది. 

PREV
14
ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు..

టాలీవుడ్ ఆడియన్స్ లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు వెంకటేష్. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ.. తనలో మార్పులు చేసుకుంటూ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు విక్టరీ వెంకటేష్. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంకటేష్.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మరోసారి సక్సెస్ సాధించారు.

24
65 ఏళ్ల వయసులో మంచి ఫామ్ లో ఉన్న హీరో..

ఈ రెండు సినిమాల సక్సెస్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకటేష్. తనకు తగ్గ పాత్రలు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేయడంతో విక్టరీ స్టార్ అంచనాలు ఎప్పుడు తప్పలేదు. కొన్ని సినిమాలు తప్పించి.. ఆయన కెరీర్ లో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. 

ఇక ప్రస్తుతం వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. నిజానికి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చాలా కాలం క్రితమే రావాల్సి ఉండగా, అప్పట్లో కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

34
వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబ..

వెంకటేష్ , త్రివిక్రమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కూడా వీరి కాంబోలో అద్బుతమైన సినిమాలు వచ్చాయి. వెంకటేష్ కెరీర్‌లో త్రివిక్రమ్ ప్రత్యేకమైన పాత్ర పోషించారు. గతంలో వెంకటేష్ సినిమాలకు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. త్రివిక్రమ్ రాసే పంచ్ లకు.. వెంకటేష్ టైమింగ్ తోడైతే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

44
రెమ్యునరేషన్ పెంచిన విక్టరీ స్టార్..

ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం వైరల్ అవుతోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం వెంకటేష్ ఈ మూవీ కోసం రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది.. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం వెంకటేష్ సుమారు 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం ఆయన దాదాపు 35 కోట్ల రూపాయలు అందుకున్నారని టాక్. ఆ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో, తాజా ప్రాజెక్ట్‌కు రెమ్యూనరేషన్ పెరిగినట్లు తెలుస్తోంది.ఆదర్శ కుటుంబం సినిమా సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించి, 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

Read more Photos on
click me!

Recommended Stories