Super Star కృష్ణ ని ఈజీగా మోసం చేసేవారు, శోభన్ బాబు మాత్రం అలా కాదు..!

Published : Jan 27, 2026, 05:37 PM IST

 టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ రెండు మూల స్తంభాలు లాంటివారే. ఈ ఇద్దరు హీరోలు కేవలం సినిమాలతోనే కాకుండా, వారి వ్యక్తిత్వంలో కూడా చెరగని ముద్ర వేశారు. 

PREV
13
Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ, సోగ్గాడు శోభన్ బాబు ఈ ఇద్దరు హీరోలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు మనకు అందించారు. అయితే.. ఈ ఇద్దరు హీరోల వ్యక్తిత్వం గురించి.. మరో సీనియర్ హీరో మురళీ మోహన్ గారు చాలా విషయాలను తెలియజేశారు.

‘కాలేజీలో కృష్ణను దేవుడు అని ముద్దుగా పిలిచేవారు. ఏ ముహుర్తాన ఆ పేరు పెట్టామో.. నిజంగానే ఆయన దేవుడు. ముఖ్యంగా నిర్మాతలకు ఆయన దేవుడు లాంటివాడు. ఎవరైనా నిర్మాత సినిమా చేసి డబ్బు పోగొట్టుకుంటే.. ఆ నిర్మాతను పిలిచి మరీ.. ఈయనే డైరెక్టర్ , డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి సినిమా చేయించేవారు’ అని మురళీ మోహన్ చెప్పారు.

23
కృష్ణ మంచి మనసు..

కృష్ణ గారు సినిమా రంగానికి చేసిన మేలు వెలకట్టలేనిది. ఆయనను అందరూ 'ప్రొడ్యూసర్స్ హీరో' అని పిలిచేవారు.

ఆయన ఆఫీసు బీరువాలో వందల కొద్దీ బౌన్స్ అయిన చెక్కులు ఉండేవి. వాటి గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు.  చాలా మంది నిర్మాతలు మోసం చేసే వాళ్లు. "వాళ్లు బాగుంటేనే కదా నాకు డబ్బులిచ్చేది, ఇప్పుడు వాళ్ల దగ్గర లేవు.. పోనీలే’’ అని వదిలేసేవారు. ఒక నిర్మాత ప్లాప్ ఇచ్చినా, లేదా డబ్బులు ఎగ్గొట్టినా.. అదే నిర్మాత మళ్లీ వచ్చి అడిగితే కాదనకుండా డేట్స్ ఇచ్చి సినిమా చేసేవారు. వారిని నిలబెట్టడానికి ప్రయత్నించేవారు. అల్లూ సీతారామ రాజు సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వదని.. ఎన్టీఆర్ వెనకంజ వేస్తే.. కృష్ణ మాత్రం.. ఆ సినిమా తీయాలనే నిర్ణయించుకున్నారు.డబ్బులు పోగొట్టుకుంటావ్ అని ఎన్టీఆర్ చెప్పినా.. కృష్ణ వినలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కి ఆరోగ్య సమస్య వస్తే.. ఆయన కోలుకొని వచ్చే వరకు సినిమాని కృష్ణ డైరెక్ట్ చేశారు. కానీ.. పేరు మాత్రం డైరెక్టర్ గా తనది వేసుకోలేదు అని మురళీ మోహన్ చెప్పారు.

33
రూపాయి విలువ తెలిసిన సోగ్గాడు..

అయితే.. శోభన్ బాబు గారు మాత్రం అలా కాదు డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటారు అనే పేరు ఉంది. అది ఆయన ప్లానింగ్ లో భాగం. ఆయన షూటింగ్ అయిపోగానే రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడేవారు కాదు. పైసాతో సహా లెక్క చూసుకునేవారు. అలా వసూలు చేసిన ప్రతి రూపాయిని ఆయన భూములపై పెట్టుబడి పెట్టారు. చెన్నై వంటి నగరాల్లో ఆయన కొన్న భూములు నేడు వేల కోట్ల విలువ చేస్తాయి.

"హీరోగా ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి, లేదంటే రిటైర్మెంట్ తర్వాత కష్టపడాలి" అని తోటి నటీనటులకు కూడా సలహా ఇచ్చేవారు.

Read more Photos on
click me!

Recommended Stories