3 చిత్రాల కోసం కలసి పనిచేసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు కారణంగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాల్సింది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పౌరాణిక కథతో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీ లేకుండానే ఆగిపోయింది. అదే ప్రాజెక్ట్‌ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్నారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
25
బన్నీ, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ?
దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ మూడు చిత్రాలు వచ్చాయి. జులాయి, అల వైకుంఠపురములో చిత్రాలు సూపర్ హిట్ కాగా.. సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదనిపించింది. అసలు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ చిత్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు ? ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి ? అనే దానిపై పలు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఒకటి ఉంది.
35
త్రివిక్రమ్ ఆలస్యం చేయడమే కారణమా ?
పుష్ప 2 చిత్రాన్ని చాలా కాలం పాటు షూట్ చేసిన అల్లు అర్జున్, ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌కు కమిట్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రం ప్రీ ప్రొడక్షన్ దశలోనే నిలిచిపోయింది.వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభిచాలని బన్నీ అనుకున్నప్పటికీ త్రివిక్రమ్ ఆలస్యం చేస్తూ వచ్చారట.
త్రివిక్రమ్ తుది స్క్రిప్ట్‌ను సిద్ధం చేయకపోవడంతో అల్లు అర్జున్ అసహనానికి లోనయ్యాడని సమాచారం. అందుకే త్రివిక్రమ్ కి క్లారిటీ ఇవ్వకుండానే అట్లీ దర్శకత్వంలో చేయబోయే కొత్త చిత్రాన్ని అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ నిర్ణయం త్రివిక్రమ్‌ను అసంతృప్తికి గురిచేసినట్టు సమాచారం. దీంతో, ఇద్దరి మధ్య సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే.
55
రెండోసారి ఎన్టీఆర్ తో..
ప్రస్తుతం, త్రివిక్రమ్ ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్నాడు. పౌరాణిక కథతో తెరకెక్కే ఈ చిత్రానికి 500 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ చిత్రం వచ్చింది. దీనితో వీరిద్దరి రెండవ కాంబినేషన్ పై అంచనాలు పెరగడం ఖాయం.