యాంకర్ శివ జ్యోతి గురించి పరిచయం అవసరం లేదు. న్యూస్ ఛానల్ యాంకర్ గా శివజ్యోతి బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమెకి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ షోతో శివ జ్యోతి గుర్తింపు మరింతగా పెరిగింది. శివ జ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీ.
25
సోషల్ మీడియాలో యాక్టివ్
తనకు సంబంధించిన క్రేజీ విషయాల్ని శివజ్యోతి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన ఫోటోలు కూడా శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా శివజ్యోతి నెట్టింట పెద్ద దమారమే రేపింది. గ్లామర్ పరంగా శివ జ్యోతి ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు.
35
బాత్ రూమ్ వీడియోతో దుమారం
కానీ తాజాగా ఆమె ఏకంగా బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివ జ్యోతి రొమాంటిక్ బిహేవియర్ చర్చనీయాంశంగా మారింది. భర్తను ప్రెస్ చేయడం ఎలా అనే రొమాంటిక్ క్యాప్షన్ తో ఈ వీడియోని శివ జ్యోతి షేర్ చేసింది.
బాత్ రూమ్ లో స్నానం చేస్తూ, చీర కట్టుకుంటూ, భర్తతో చిలిపి వేషాలు వేస్తూ శివ జ్యోతి రొమాంటిక్ గా కనిపించింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఒక కార్పొరేట్ బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తోంది. ప్రమోషన్ లో భాగంగానే ఇలా శివజ్యోతి బాత్ రూమ్ వీడియో షేర్ చేసింది.
55
నెటిజన్ల ట్రోలింగ్
దీంతో కొందరు నెటిజన్లు శివ జ్యోతిని ట్రోల్ చేస్తున్నారు. డబ్బు కోసం ఏకంగా ప్రైవేట్ విషయాలని సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. శివజ్యోతికి మంచి ఇమేజ్ ఉంది, దానినిపాడు చేసుకుంటోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు ఇలాంటి సెలబ్రిటీలు ప్రచారం చేసే ప్రొడక్ట్స్ ను నమ్మొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.