`థామా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రష్మిక మందన్నా భయపెట్టిందా?

Published : Oct 21, 2025, 02:16 PM IST

రష్మిక మందన్నా నటించిన సినిమా అంటే అది మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె `థామా` చిత్రంలో నటించింది. ఈ సినిమా నేడు మంగళవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే? 

PREV
16
`థామా` మూవీ రివ్యూ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఈ ఏడాది `ఛావా`, `కుబేర` చిత్రాలతో హిట్లు అందుకుంది. ఇప్పుడు ఆమె హిందీలో `థామా` చిత్రంలో నటించింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన చిత్రమిది. ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. దీపావళి పండగ స్పెషల్‌గా ఈ మూవీ నేడు మంగళవారం( అక్టోబర్‌ 21న) విడుదలైంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? రష్మిక మరో హిట్‌ అందుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`థామా` మూవీ కథ ఏంటంటే?

అలోక్ గోయల్‌(ఆయుష్మాన్‌ ఖురానా) హిస్టోరియన్‌ డిస్కవర్‌. ఒక ఫారెస్ట్ లో కొత్త విషయాలని ప్రపంచానికి చూపించే సాహసం చేస్తాడు. ఎలుగుబంటి వెంబడించడంతో దాన్నుంచి పారిపోయే క్రమంలో దానికి దొరికిపోతాడు. కానీ తడకా(రష్మిక మందన్నా) అలోక్‌ని కాపాడుతుంది. ఆమె బేతాళురాలు. వాళ్లంతా వందల ఏళ్లుగా ఆ ఫారెస్ట్ లో ఉంటారు. ఒకప్పుడు మనుషుల రక్తం తాగే వాళ్లు ఆ తర్వాత మనుషుల్లోని చెడ్డవారిని అంతం చేసేందుకు కంకణం కట్టుకుంటారు. అప్పట్నుంచి మనుషులకు హాని చేయకుండా వారిని రక్షిస్తుంటారు. అయితే తమ అడవిలోకి అలోక్‌ రావడంతో అతన్ని చంపాలని కొందరు, ప్రాణాలతో వదిలేయాలని మరికొందరు చెబుతుంటారు. వారి పెద్ద మాత్రం వదిలేమయని ఆదేశిస్తాడు. కానీ కొన్నేళ్లుగా గుహలో బంధీగా ఉన్నా థామా(నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) తనకు మనిషి రక్తం కావాలని తన వాళ్లని ఆదేశిస్తాడు. అలోక్‌ని థామాకి బలివ్వాలని భావిస్తారు. కానీ వారి నుంచి అలోక్‌ని తడకా కాపాడుతుంది. అతని ప్రేమలో పడుతుంది. అతనితోపాటు ఇంటికి కూడా వెళ్తుంది. అయితే ఇంట్లో తడకా చర్యలు ఆశ్చర్యపరుస్తుంటాయి. అవి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటాయి. మరోవైపు తడకా నగరంలో ఉందని తెలిసి వాళ్ల మనిషి అయిన సీఐ ఆమెని కలిసి అడవిలోకి వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు. ప్రమాదం పొంచి ఉందని చెబుతాడు. దీంతో తాను వెళ్లిపోయే క్రమంలో అలోక్‌కి యాక్సిడెంట్ అవుతుంది. అతను చనిపోతాడు. అలోక్‌ని ఎలాగైనా కాపాడాలని తమ నియమాలని బ్రేక్‌ చేసి అతన్ని కాటేస్తుంది తడకా. దీంతో మళ్లీ అలోక్‌ బతుకుతాడు. కానీ మనిషి కాదు, తమలా బేతాళుడిగా మారిపోతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరిని తోడేలు ఎందుకు వెంటాడుతుంది? తడకా, అలోక్‌ తిరిగి అడవికి వెళ్లిపోయారా? తమ బేతాళ నియమాలను ఉల్లంగించిన తడకాకి ఎలాంటి శిక్ష వేశారు? 75ఏళ్లుగా థామా ఎందుకు బందీగా ఉన్నాడు? అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.

36
`థామా` మూవీ విశ్లేషణ

మడాక్‌ హర్రర్‌ కామెడీ యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రమిది. గతంలో `స్ట్రీ`, `బెడియా`, `ముంజ్యా`, `స్ట్రీ 2` చిత్రాలు వచ్చాయి. అందులో భాగంగా ఇపుడు ఐదో సిరీస్‌గా `థామా` వచ్చింది. `స్ట్రీ` మూవీస్‌ బాలీవుడ్‌లో ఎంతటి ఘన విజయాలు సాధించాయో తెలిసిందే. బాక్సాఫీసుని షేక్‌ చేశాయి. ఈ క్రమంలో `థామా` చిత్రంపై అంచనాలున్నాయి. అయితే ఆ రేంజ్‌లో `థామా` మూవీ లేకపోవడం గమనార్హం. సినిమా ఏదైనా అందులో ఒక ఎమోషన్‌, సోల్ చాలా ముఖ్యం. అది క్యారీ అవుతేనే సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. లేదంటే కేవలం సీన్లుగానే మిగిలిపోతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అయితే ఇలాంటి కథలు నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. మైథాలజీ, బేతాళ కథలను వాళ్లు ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. వినడానికి చాలా బాగుంటాయి. వాటిని అంతే బాగా తెరపై ఆవిష్కరిస్తే బాగా కనెక్ట్ అవుతాయి. `స్ట్రీ`మూవీస్‌ అంతగా కనెక్ట్ కావడానికి కారణం అదే. ఈ మూవీని కూడా అలానే నడిపించారు. బేతాళులను, మనుషులకు ముడిపెడుతూ కథని నడిపించిన తీరు బాగుంది. కానీ దాన్ని అంతే బాగా కన్విన్స్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఇందులో రష్మిక మందన్నా చేసే యాక్షన్‌, ఆమె నటన మనకు కట్టిపడేస్తుంది.

46
`థామా` మూవీ హైలైట్స్, మైనస్‌లు

ఫస్టాఫ్‌లో బేతాళురాలైన రష్మిక మనిషికి కనెక్ట్ కావడం, అతన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయడం, ప్రేమలో పడటం, ప్రేమ కోసం తమ నియమాలనే బ్రేక్‌ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో సీరియస్‌ కథని కూడా కామెడీగా చెప్పడం బాగుంది. కాకపోతే ఆ కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదు. దీంతో బోర్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక సెకండాఫ్‌ని మరింత డ్రామాటిక్‌గా తయారు చేశారు. దాన్ని చాలా ట్విస్ట్ లు టర్న్ లతో తీసుకెళ్లారు. `బేడియా` మూవీకి లింక్‌ చేసిన తీరు బాగుంది. ఈ సందర్భంగా వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ అదిరిపోయింది. క్లైమాక్స్ ని బాగా డీల్‌ చేశారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ యాక్షన్‌ సీన్లు, గూస్‌ బంమ్స్ తెప్పించే సన్నివేశాలతో వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. ఆయా సీన్ల ఆడియెన్స్ కి హై ఫీల్‌ని ఇస్తాయి. ఆయుష్మాన్‌ ఖురానా పాత్రలోని ట్విస్ట్ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకుంటాయి.

అయితే సినిమాలో కామెడీ ప్రయత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. ప్రేమలో ఫీల్‌ లేకపోవడంతో ఆయా సీన్లు తేలిపోతాయి. ఎమోషన్స్ కూడా క్యారీ కాలేదు. దీంతో తెరపై సీన్లు మాత్రమే కనిపిస్తాయి. సెకండాఫ్‌లో ట్విస్ట్ లు కూడా వాహ్‌ అనిపించేలా లేవు. క్లైమాక్స్ లో యాక్షన్‌ సీన్లు తొందరగా తేల్చేసినట్టు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో లేవు. హర్రర్‌ ఎలిమెంట్లు కూడా బలంగా లేవు. చాలా లైటర్‌ వేలో చూపించారు. దీంతో థ్రిల్‌ మిస్‌ అయ్యింది. ఇలాంటి సినిమాల్లో ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసేది థ్రిల్‌. కానీ అదే ఆశించిన స్థాయిలో లేదు. ఇవన్నీ మైనస్‌గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీ నార్త్ ఆడియెన్స్ కి కొంత వరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాని తెలుగు, సౌత్‌ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కవు. రష్మిక మందన్నా తప్ప ఇందులో అంతగా ఎంగేజ్‌ చేసే ఫ్యాక్టర్‌ లేకపోవడం గమనార్హం.

56
`థామా` మూవీ నటీనటుల ప్రదర్శన

ఈ సినిమాకి రష్మిక మందన్నానే హీరో అని చెప్పాలి. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా నడుస్తుంది. ఆమెనే ఎక్కువగా యాక్షన్‌ చేస్తుంది. ఆమెనే ప్రేమిస్తుంది. ఆమెనే ముగింపుకి కారణమవుతుంది. దీంతో ఇది రష్మిక మూవీలా అనిపిస్తుంది. తడకా పాత్రలో రష్మిక ఇరగదీసింది. యాక్షన్‌ సీన్లలోనూ రెచ్చిపోయింది. ఆమె పాత్రలోని వేరియేషన్స్ సైతం ఆకట్టుకుంటాయి. ఇక అలోక్‌ పాత్రలో ఆయుష్మాన్‌ ఖురానా బాగా చేశారు. డిఫరెంట్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ థామాగా ఉన్నంతసేపు అదరగొట్టాడు. ఆ పాత్రని స్ట్రాంగ్‌గా చూపించారు. కాకపోతే పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయారు. వరుణ్‌ ధావన్‌ స్పెషల్‌ ఎంట్రీ వాహ్‌ అనిపిస్తుంది. ఆయుష్మాన్‌ తండ్రిగా పరేష్‌ రావల్‌ పాత్ర నవ్విస్తుంది. సత్యరాజ్‌ కాసేపు కనిపించి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.

66
`థామా` మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమా టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉంది. సచిన్‌ జిగర్‌ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా, అలరించేలా ఉన్నాయి. ఇక బీజీఎం హైలైట్‌గా నిలుస్తుంది. యాక్షన్‌ సీన్లలో, అదే సమయంలో లవ్‌ సీన్లలో ఆకట్టుకుంటుంది. ఆ ప్రభావం తెరపై కనిపిస్తుంది. సౌరభ్‌ గోస్వామి కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ కట్టిపడేస్తాయి. హేమంతి సర్కార్ ఎడిటింగ్‌ పర్వాలేదు. ఇంకాస్త షార్ప్ చేసినా నష్టం లేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇక దర్శకుడు ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకుడిగా పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదని చెప్పొచ్చు. ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే అందంగా, ఆసక్తికరంగా చెప్పొచ్చు. కానీ ఎంగేజ్‌ చేసేలా తెరకెక్కించడంలో సక్సెస్‌ కాలేదు. హర్రర్‌, కామెడీపై ఇంకా వర్క్ చేయాల్సింది. ఎమోషన్స్ పరంగా ఇంకా బాగా రాసుకోవాల్సింది. చాలా వరకు లైటర్‌ వేలో చెప్పారు. కానీ డెప్త్ గా, ఇంకా ఎంగేజింగ్‌గా తెరకెక్కిస్తే అదిరిపోయేది.

ఫైనల్ గాః నవ్వించలేక, థ్రిల్‌ ని పంచలేకపోయిన `థామా` 

రేటింగ్‌ః 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories