OTT Movie: ఓ టీనేజ్ అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం ఊహించని సక్సెస్ సాధించింది. రూ. 15 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా వందల కోట్లు వచ్చిపడ్డాయ్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా.?
బాలీవుడ్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లను వసూలు చేసింది. మరి ఆ చిత్రం ఏంటని ఆలోచిస్తున్నారా.? అదేనండీ.! 'సీక్రెట్ సూపర్‌స్టార్'.
25
16 ఏళ్ల అమ్మాయి చుట్టూ కథ..
ఈ మూవీను అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. జైరా వాసిమ్ హీరోయిన్‌గా పరిచయమైంది. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. గాయని కావాలని కోరుకునే సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక టీనేజర్ చుట్టూ తిరిగే కథ ఇది. తన ఫేస్ రివీల్ చేయకుండా హీరోయిన్.. ఈ సినిమాలో బురఖా ధరించి ఆన్‌లైన్‌లో సింగింగ్ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. క్రమంగా సంచలనం అవుతుంది.
35
బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్..
ఈ సినిమాను దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లు వసూలు చేసింది. దీనికి ముఖ్య కారణం ఓవర్సీస్ కలెక్షన్లే. భారతదేశంలోనే ఇది దాదాపు రూ. 63 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాకు చైనాలో రూ. 327 కోట్లు దాటి కలెక్షన్లు రాగా.. ఇది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇందులో హీరోయిన్ తండ్రిగా రాజ్ అర్జున్, ఆమె తల్లిగా మెహర్ విజ్ నటించారు.
55
బెస్ట్ ఫిల్మ్‌లలో ఒకటి..
'సీక్రెట్ సూపర్ స్టార్' ఓ బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. హీరోయిన్ అద్భుత నటన, సమాజానికి సంబంధించి ఓ మెసేజ్ ఉండటంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నాలుగు గోడలే తన ప్రపంచంగా ఎదిగిన ఓ యువతి.. చివరికి తన కలలను ఎలా సాధించింది అనేది కథాంశం కాగా.. ప్రధాన పాత్రలో నటించిన జైరా వసీం తన నటనను ప్రేక్షకులను ఆకట్టుకుంది.